తహసీల్దారు కార్యాలయ ఆవరణలో వ్యాపారం

ABN , First Publish Date - 2021-10-26T03:56:12+05:30 IST

తహసీల్దారు కార్యాలయ ఆవరణ ఇటీవల వ్యాపార కేంద్రంగా మారింది. తహసీల్దారు కార్యాలయానికి వెళ్లే మార్గంలో ఓ రియల్‌

తహసీల్దారు కార్యాలయ ఆవరణలో వ్యాపారం
తహసీల్దారు కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన టెంట్‌

 కోవూరు, అక్టోబరు 25ః తహసీల్దారు కార్యాలయ ఆవరణ ఇటీవల వ్యాపార కేంద్రంగా మారింది. తహసీల్దారు కార్యాలయానికి వెళ్లే మార్గంలో ఓ  రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార సంస్ధ సోమవారం టెంట్‌ వేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యాపార లావాదేవీలను కొనసాగించింది. ఒక్క అధికారి కూడా ఇదేమటని ప్రశ్నించనే లేదు. గతంలో  తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో ఓ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాల బస్సును ఉంచగా, కలెక్టరు శ్రీకాంత్‌ వెంటనే తీసి వేయమని ఆదేశించారు. తహసీల్దారు కార్యాలయ ఆవరణ రెవెన్యూ అధికారుల పరిధిలోనే ఉంటుందని, ఆవరణలో ప్రైవేటు సంస్ధల కార్యకలాపాలు కొనసాగకూడదని హెచ్చరించారు.   అలాంటిది ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్ధ యఽథేచ్ఛగా వ్యాపారం చేసుకుంటున్నా తహసీల్దారు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు  పట్టించుకోకపోవడం  విశేషం.


Updated Date - 2021-10-26T03:56:12+05:30 IST