మా సర్వర్లను హ్యాక్ చేశారు

ABN , First Publish Date - 2021-10-16T02:38:05+05:30 IST

భారత్‌లోని తమ సర్వర్లను హ్యాక్ చేసినట్లు తైవాన్‌కు చెందిన టెక్ దిగ్గజం ఏసర్ దృవీకరించింది. ఈ క్రమంలో... వినియోగదారులకు సంబంధించిన 60 జీబీ డేటాను హ్యాకింగ్‌కు గురైనట్లు వెల్లడించింది.

మా సర్వర్లను హ్యాక్ చేశారు

తైపే : భారత్‌లోని తమ సర్వర్లను హ్యాక్ చేసినట్లు తైవాన్‌కు చెందిన టెక్ దిగ్గజం ఏసర్  దృవీకరించింది. ఈ క్రమంలో... వినియోగదారులకు సంబంధించిన 60 జీబీ  డేటాను హ్యాకింగ్‌కు గురైనట్లు వెల్లడించింది. కాగా... ఈ ఏడాదిలో కంపెనీ డేటాను దొంగలించడం ఇది రెండవ సారి. సున్నితమైన ఖాతాల సమాచారంతోపాటు యూజర్ల వ్యక్తిగత సమాచారం, ఆర్థిక డేటా, కార్పొరేట్ కస్టమర్ డేటాలను యాక్సెస్ చేసినట్లు ‘హిందుస్థాన్ టైమ్స్’ నివేదించింది. భారత్‌లోని పది వేల మంది ఖాతాదారుల రికార్డులకు సంబంధించిన ఫైళ్లు, డేటాబేస్‌లతో  కూడిన వీడియోను హ్యాకర్ గ్రూపు పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ తో పాటు ‘ఇక మేం వచ్చేస్తున్నాం’ అంటూ ఓహెచ్చరికను కూడా ఆ గ్రూప్ పోస్ట్ చేయడం విశేషం. భారత్‌లో ఏసర్ రిటైలర్లు, పంపిణీదారులకు సంబంధించి మూడు వేల సెట్లకు చెందిన లాగిన్ క్రెడెన్షియల్స్ తమకు అందుబాటులో ఉన్నాయని హ్యాకర్ బృందం పేర్కొంది. 

Updated Date - 2021-10-16T02:38:05+05:30 IST