Advertisement
Advertisement
Abn logo
Advertisement

పాక్‌ను కూల్చిన తైజుల్‌

చిట్టగాంగ్‌: పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్‌కు ఆధిక్యం లభించింది. ఎడమచేతి వాటం స్పిన్నర్‌ తైజుల్‌ ఇస్లాం (7/116) అద్వితీయ ప్రదర్శన కనబర్చడంతో పాక్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైంది. 145/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడోరోజు పాక్‌ పటిష్టంగానే కనిపించినా తైజుల్‌ ధాటికి కుదేలైంది. ఓపెనర్లు అబిద్‌ అలీ (133), షఫీక్‌ (52) మాత్రమే రాణించారు. ఇక 44 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన బంగ్లా కూడా తడబడింది. పేసర్‌ షహీన్‌ మూడు వికెట్లు తీయడంతో రోజు ముగిసే సమయానికి 19 ఓవర్లలో 39/4 స్కోరుతో కష్టాల్లో పడింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌ కేవలం 83 పరుగుల ఆధిక్యంలోనే ఉండగా ఆటకు ఇంకా రెండు రోజుల సమయం ఉంది.

Advertisement
Advertisement