మద్యం తరలించేవారిపై చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2020-08-05T11:42:45+05:30 IST

v..

మద్యం తరలించేవారిపై చర్యలు తీసుకోండి

పోలీస్‌ అధికారులతో ఎస్పీ నారాయణ నాయక్‌ సమీక్ష


ఏలూరు క్రైం, ఆగస్టు 4 : మత్తు పదార్థాలు, సారాను అక్రమంగా విక్రయించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ నారాయణ నాయక్‌ ఆదేశాలు జారీ చేశారు. ఏలూరు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో జిల్లా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పోలీసు అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహించాలని మద్యం అతిగా తాగే వారిని కనుగొని ఆస్పత్రులకు, డీఅడెక్షన్‌ సెంటర్లకు పంపా లన్నారు.


సారా తయారీ దారులపై నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవా లన్నారు. స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులతో సమన్వయంతో సమాచారం సేకరించి దాడులు నిర్వహించాలన్నారు. సారా తయారీదారుల సమా చారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. సమావే శంలో జిల్లా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో అదనపు ఎస్పీ కరీముల్లా షరీఫ్‌, ఎక్సైజ్‌ కమీషనర్‌ ఎం జయరాజు, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ చిట్టిబాబు, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఆయేషాబేగం పలువురు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-05T11:42:45+05:30 IST