Abn logo
Sep 26 2021 @ 00:25AM

వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై చర్యలు తీసుకోండి

పెనుకొండ, సెప్టెంబరు 25: పీడీఎఫ్‌, ఎమ్మెల్సీ ఇండ్ల వెంకటేశ్వర్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక ఎమ్మార్సీలో యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి సుధాక ర్‌, నారాయణస్వామి, కృష్ణానాయక్‌, రవీంద్రనాథ్‌, రమేష్‌, సత్యమయ్య, నరేష్‌, ఉపేంద్ర, ఆది, దినేష్‌, సోమశేఖర్‌, సుధాకర్‌, నరేష్‌, నాగేంద్ర, తదితరులు నల్లబ్యాడ్జిలు ఽధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జయచంద్రారెడ్డి మాట్లాడుతూ దశాబ్దాలకాలంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ విద్యారంగానికి రాష్ట్ర యూటీఎఫ్‌ అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా, జేఏసీ జనరల్‌ కార్యదర్శిగా పనిచేసి తూర్పుగోదావరి జిల్లా పట్టభద్రుడు ఎమ్మెల్సీగా విజయం సాధించిన వెంకటేశ్వర్‌రావుపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఒక సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేయడంపై యూటీఎఫ్‌ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. మంత్రిపై ముఖ్యమంత్రి వెంటనే చొరవ తీసుకుని ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.