కనిగిరి కరకట్టలు ఽధ్వంసం చేస్తున్నా పట్టదా!

ABN , First Publish Date - 2021-06-15T05:02:18+05:30 IST

అభివృద్ధి పేరుతో కొందరు నేతలు కనిగిరి రిజర్వాయర్‌ కరకట్టలను కొన్ని నెలలుగా యంత్రాలతో ధ్వంసం చేస్తూ గ్రావెల్‌ను ప్రైవేటు లే అవుట్లకు తోలుకుంటూ పబ్బం గడుపుకుంటున్నా పట్టించుకునే అధికారులే లేరని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు

కనిగిరి కరకట్టలు ఽధ్వంసం చేస్తున్నా పట్టదా!
బుచ్చి టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న టీడీపీ నాయకులు.

 అధికారుల తీరుపై టీడీపీ నేతల ఆగ్రహం

బుచ్చిరెడ్డిపాళెం,జూన్‌14: అభివృద్ధి పేరుతో కొందరు నేతలు కనిగిరి రిజర్వాయర్‌ కరకట్టలను కొన్ని నెలలుగా యంత్రాలతో ధ్వంసం చేస్తూ గ్రావెల్‌ను ప్రైవేటు లే అవుట్లకు తోలుకుంటూ  పబ్బం గడుపుకుంటున్నా పట్టించుకునే అధికారులే లేరని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం బుచ్చిలోని టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ మండలాధ్యక్షుడు ఎంవీ. శేషయ్య అధ్యక్షతన మండల స్థాయి సమావేశం జరిగింది. ఈసందర్భంగా  నాయకులు మాట్లాడుతూ బుచ్చితోపాటు 9 మండలాల్లో సుమారు 3లక్షల ఎకరాలకు సాగునీరందించే కనిగిరి రిజర్వాయర్‌ కరకట్టలను అక్రమార్కులు ధ్వంసం చేస్తున్నారన్నారు. ఆ కరకట్టలను కాపాడాల్సిన ప్రజా ప్రతినిధులు, అఽధికారులు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. గ్రావెల తరలింపు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో వచ్చే వర్షాలు, వరదలకు రిజర్వాయర్‌కు ముప్పు తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. కనిగిరి రిజర్వాయర్‌ను వదలిపెట్టి ఇంకెక్కడ నుంచైనా గ్రావెల్‌ తవ్వుకోవాలన్నారు. బుచ్చి ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల కొరతతో రోగులకు వైద్య సేవలు అందడంలేదన్నారు. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సీహెచ్‌. కృష్ణ చైతన్య  రామానాయుడు, వెంకటేశ్వర్లు, ప్రభాకర్‌రెడ్డి, వి. శ్రీనివాసులు, విల్సన్‌, చోటుతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-15T05:02:18+05:30 IST