భూకబ్జాలపై చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2021-06-20T05:43:41+05:30 IST

శాఖ జిల్లా భూకబ్జాలకు కేంద్రంగా మారిందని, వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు, పేదల అస్సైన్డ్‌ భూములు కబ్జాకు గురయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ నర్సింగరావు ఆరోపించారు.

భూకబ్జాలపై చర్యలు తీసుకోండి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న నర్సింగరావు

సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ నర్సింగరావు 

సిరిపురం, జూన్‌ 19: విశాఖ జిల్లా భూకబ్జాలకు కేంద్రంగా మారిందని, వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు, పేదల అస్సైన్డ్‌ భూములు కబ్జాకు గురయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ నర్సింగరావు ఆరోపించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ భూ తిమింగిలాల చేతుల్లో ఉన్న ఆక్రమణలపై చర్యలు తీసుకోవడంపై చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని విమర్శించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ఆక్రమణదారులపై చర్యలు చేపట్టి భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. వేలాది ఎకరాల భూ కుంభకోణంపై సిట్‌ ఇచ్చిన రిపోర్టుపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం స్వార్థం, రాజకీయ కక్షలతో కాకుండా నిజాయితీగా భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలు, స్థలాలను తాకట్టు పెట్టాలనుకోవడం సమంజసం కాదన్నారు. ఈ సమావేశంలో సీపీఎం నగర కార్యదర్శి బి.గంగారావు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-20T05:43:41+05:30 IST