Abn logo
Sep 25 2021 @ 00:35AM

ప్రత్యేక వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ధర్మపురిలో వ్యాక్సిన్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్‌ రవి

  కలెక్టర్‌ గుగులోతు రవి

ధర్మపురి, సెప్టెంబరు 24: జిల్లాలో 18 ఏళ్లు పైబడిన వారి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని  క లెక్టర్‌ గుగులోతు రవి అన్నారు. ధర్మపురి మండలంలోని నేరెళ్ల, ధర్మపురి, మగ్గిడి -ఎడపల్లి గ్రామాల్లో జిల్లా అదనపు కలెక్టర్‌ అరుణశ్రీతో కలిసి శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మొదట ఆయన మండలంలోని నేరెళ్ల గ్రామపం చాయితీ ఆవరణలో గల వ్యాక్సిన్‌ కేంద్రాన్ని సందర్శించారు. వ్యాక్సిన్‌ పని తీరు గురించి తెలుసుకున్న ఆయన వసతుల ఏర్పాట్ల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ధర్మపురి మున్సిపాలిటీ, తమ్మల్లకుంట ప్రభుత్వ పాఠశాల ఆవరణలో గల వ్యాక్సిన్‌ కేంద్రాలను సందర్శించారు. కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన వసతుల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. సెప్టెంబరు 23 వరకు 274 ప్రత్యేక వ్యాక్సిన్‌ కేంద్రాల్లో 1,13,666 మందికి, 24 వరకు దాదాపు 1,31,918 మందికి వ్యాక్సినేషన్‌ అందించామని తెలిపారు. కొవిడ్‌ మహమ్మారి నివారణకు వంద శాతం వ్యాక్సినేష న్‌ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే పట్టణంలో రోడ్డు వెడల్పు, సీసీ రోడ్లు, సైడ్‌ డ్రైనేజీ నిర్మాణ పనులు గురించి మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండలంలోని మగ్గిడి-ఎడపల్లి గ్రామంలో బృ హత్‌ పల్లె ప్రకృతి వనాలను పరిశీలించిన ఆయన మొక్కను నాటారు. 31,000 మొక్కలు నాటిన సర్పంచ్‌ శ్రీనివాస్‌, సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందిం చారు. గాదెపల్లి గ్రామంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండ కాపాడాల ని ఆయన తహసీల్దార్‌ వెంకటేష్‌కు తెలిపారు. ఆయన వెంట జిల్లా గ్రామీణా భివృద్ధి అధికారి వినోద్‌కుమార్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి శ్రీధర్‌, తహసీ ల్దార్‌ వెంకటేష్‌, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, ఎంపీవో నరేష్‌కుమార్‌, మున్సిపల్‌ మే నేజర్‌ సంపత్‌రెడ్డి, సర్పంచులు వసుంధర, శ్రీనివాస్‌, పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.