ఉచిత గ్యాస్‌ పంపిణీని సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-10-17T04:42:31+05:30 IST

ఉజ్వల పథకం కింద పంపిణీ చేస్తున్న ఉచిత గ్యాస్‌ను సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ వైస్‌చైర్మన్‌ కోనేరు కృష్ణారావు అన్నారు.

ఉచిత గ్యాస్‌ పంపిణీని సద్వినియోగం చేసుకోవాలి
గ్యాస్‌ కనెక్షన్లు పంపిణీ చేస్తున్న జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు

సిర్పూర్‌(టి), అక్టోబరు 16: ఉజ్వల పథకం కింద పంపిణీ చేస్తున్న ఉచిత గ్యాస్‌ను సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ వైస్‌చైర్మన్‌ కోనేరు కృష్ణారావు అన్నారు. శుక్ర వారం మండల కేంద్రంలోని హెచ్‌పీ గ్యాస్‌ డీలర్‌ వద్ద మంజూరైన గ్యాస్‌ కనెక్షన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీలర్‌ ఖుర్షిద్‌ హుస్సేన్‌, మండల కోఆప్షన్‌ సభ్యుడు కీజర్‌ హుస్సేన్‌ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-10-17T04:42:31+05:30 IST