Abn logo
Oct 23 2021 @ 23:21PM

ఉచిత న్యాయసేవలను సద్వినియోగం చేసుకోవాలి

అక్కన్నపేటలో మాట్లాడుతున్న జడ్జి శివరంజని

  అవగాహన సదస్సులో హుస్నాబాద్‌ ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి శివరంజని


అక్కన్నపేట, అక్టోబరు 23: ఉచిత న్యాయ సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని హుస్నాబాద్‌ ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి శివరంజని కోరారు. శనివారం అక్కన్నపేట మండల కేంద్రంలో జాతీయ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆధ్వర్యంలో న్యాయపరమైన హక్కులపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఉచిత న్యాయ సేవలు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు సూచనమేరకు సదస్సులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మండల స్థాయిలో ఉచిత న్యాయ సహాయం కావాల్సినవారు న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ కొత్తపల్లి రవి, సర్పంచ్‌ ముత్యాల సంజీవరెడ్డి, న్యాయవాదులు చిత్తారి రవీందర్‌, ఎల్లారెడ్డి, కన్నోజు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


దుద్దెడలో న్యాయ విజ్ఞాన సదస్సు


కొండపాక, అక్టోబరు 23: ప్రతీ ఒక్కరు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని జూనియర్‌ సివిల్‌ జడ్జి సాల్మా ఫాతిమా సూచించారు. దుద్దెడలో శనివారం మండల లీగల్‌ ఎడ్‌ న్యాయవాది కృష్ణమోహన్‌ ఆధ్వర్యంలో జిల్లా న్యాయాధికారి సేవా సంస్థ వారి సలహాతో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్‌ సివిల్‌ జడ్జి ఫాతిమా మాట్లాడారు. ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దేవునూరి రవీందర్‌, మండల లీగల్‌ ఎడ్‌ న్యాయవాది కృష్ణమోహన్‌, సర్పంచ్‌ మహదేవ్‌, త్రీ టౌన్‌ సీఐ ప్రవీణ్‌ కుమార్‌, ఎస్‌ఐ సిద్ధులు, మదర్సా చైర్మన్‌ కలీల్‌ పాల్గొన్నారు.