సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-01-19T05:07:58+05:30 IST

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రూ.50వేల లోపు పూర్తి సబ్సిడీతో నిరుపేద దళితులకు ఉపాధికి ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.

సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
తల్లాడలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే వెంకటవీరయ్య

 ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య 

 ఎస్సీ లబ్ధిదారులకు చెక్కుల అందజేత

తల్లాడ/పెనుబల్లి, జనవరి 18: ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రూ.50వేల లోపు పూర్తి సబ్సిడీతో నిరుపేద దళితులకు ఉపాధికి ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మంగళవారం తల్లాడ రైతువేదికలో 21మంది ఎస్సీ లబ్ధిదారులకు రూ.10.50లక్షల చెక్కులను పంపిణీ చేశారు. లబ్ధిదారులు సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకొని ఉపాధి పొందాలని ఆయన సూచించారు. దళిత కుటుంబాలకు ఆర్థిక స్వాలంభన, ఆత్మాభిమానంతో జీవించేలా సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని ఆయన పేర్కొన్నారు. కార్య్రకమంలో ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, సొసైటీ చైర్మన్‌లు రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, అయిలూరి ప్రదీ్‌పరెడ్డి, తహసీల్దార్‌ గంటా శ్రీలత, ఎంపీడీవో బి.రవీందర్‌రెడ్డి, ఎంపీవో కొండపల్లి శ్రీదేవి, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ దూపాటి భద్రరాజు, ఎంపీటీసీలు దగ్గుతల రఘుపతిరెడ్డి, చల్లా తిరుమలాదేవి, కోపిల కనకయ్య, సర్పంచ్‌లు నారపోగు వెంకట్‌, మాగంటి కృష్ణయ్య, ఓబుల సీతారామిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్‌ నాయుడు శ్రీనివాసరావు, టీఆర్‌ఎస్‌ జోన్‌ కన్వీనర్లు దగ్గుల శ్రీనివాసరెడ్డి, దిరిశాల దాసూరావు, బద్దం కోటిరెడ్డి, నీలాద్రి దేవస్థానం డైరెక్టర్‌ పెరిక నాగేశ్వరరావు(చిన్నబ్బాయి), ఉపసర్పంచ్‌ వజ్రాల రామిరెడ్డి, తేళ్లూరి రఘు, ఎక్కిరాల సుదర్శన్‌ పాల్గొన్నారు.

పెనుబల్లి: రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూలు కులాలకు సబ్సిడీ ద్వారా అందిస్తున్న రుణాలను యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మంగళవారం పెనుబల్లి ఎంపీడీవో కార్యాలయంలో 2018-19లో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 26మంది లబ్ధిదారులకు రూ.13లక్షలు మంజూరుకాగా ఆచెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ చెక్కిలాల లక్ష్మణ్‌రావు, ఎంపీపీ సలహాదారు లక్కినేని వినీల్‌బాబు, ఎంపీడీవో మహాలక్ష్మీ, తహసీల్దార్‌ రమాదేవి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-19T05:07:58+05:30 IST