ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-01-23T06:32:50+05:30 IST

రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని జిల్లా పౌర సరఫరాల మేనేజర్‌ నారదాముని అన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న నరదముని

ముండ్లమూరు, జనవరి 22 : రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని జిల్లా పౌర సరఫరాల మేనేజర్‌ నారదాముని అన్నారు. శనివారం మం డలంలోని ముండ్లమూరు, పసుపుగల్లు రైతు భరోసా కేంద్రాలను సందర్శించారు. కెల్లంపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం పండించిన రైతులు బయట దళారులకు అమ్ముకొని మోస పోవద్దన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన కొనుగో లు కేంద్రాల్లో రైతుకు మద్దతు ధర ఉంటుందన్నారు. రైతులు ప్రస్తుతం వరి ధాన్యం 75 కేజీల బస్తా ప్రభుత్వ మద్దతు ధర రూ 1450 ఉందన్నారు. రైతు భరోసా కేంద్రంలో పని చేసే ఉద్యోగులు రైతులకు కల్పిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకొనే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి శ్రీధర్‌, సొసైటీ అధ్యక్షులు ఎం వెంకట సుబ్బారెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-23T06:32:50+05:30 IST