కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-04-19T04:11:29+05:30 IST

రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకో వాలని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు.

కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
బస్వాపూర్‌లో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌

భిక్కనూరు, ఏప్రిల్‌ 18: రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకో వాలని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. ఆదివారం మండలంలోని బస్వాపూర్‌ గ్రామంలో విండో ఆవరణలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వవిప్‌ ప్రారంభించారు. ఈ మేరకు ప్రభుత్వ విప్‌ మాట్లాడుతూ రైతులు ఎంతో కష్టప డి పండించిన పంటను దళారులకు విక్రయించి మోసపోవ ద్దని సూచించారు. ప్రభుత్వం వరికి మద్దతు ధర కల్పించ డం జరుగుతుందని, రైతులు వరి కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని కోరారు. కొవిడ్‌ దృష్ట్యా రైతులు, విండో సిబ్బంది తప్పకుండా మాస్క్‌లు ధరించాలని, భౌతి క దూరం పాటించాలన్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగు జాగ్రత్త లు తీసుకోవాలని విండో సిబ్బందికి సూచించారు. ఈ కార్య క్రమంలో ఎంపీపీ గాల్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ కిష్టాగౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు భగవంత్‌రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్‌ నర్సింహారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ శేఖర్‌, సర్పంచ్‌ మం జుల, విండో ఉపాధ్యక్షుడు మద్ది స్వామి, ఎంపీటీసీ లీలావ తి, విండో చైర్మన్‌ భూంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
లింగంపేట మండలంలో..
లింగంపేట: మండలంలోని లింగంపేట, ఐలాపూర్‌, లిం గంపల్లి, మెంగారం, బోనాల్‌ గ్రామాల్లో ఆదివారం ఎంపీపీ గరీబున్నీసా, పీఏసీఎస్‌ చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి ధాన్యం కొను గోలు కేంద్రాలను ప్రారంభించారు. ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వం ఏ గ్రేడు ధాన్యానికి క్వింటాలుకు రూ.1888 చెల్లిస్తుందని రైతులు దళారులకు విక్రయించి మోసపోవ ద్దన్నారు. రైతులు ఆరిన ధాన్యాన్ని కేంద్రానికి తీసుకురా వాలని ఆమె కోరారు. ధాన్యం విక్రయించిన రైతులకు వారం రోజుల్లో డబ్బులు వారి ఖాతాల్లో జమ చేస్తామన్నా రు. కార్యక్రమంలో సీఈవో సందీప్‌, సర్పంచ్‌లు లావణ్య, ధనలక్ష్మీ, సుశీల ఎల్లారెడ్డి మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ నరహరి, పీఏసీఎస్‌ వైస్‌చైర్మన్‌ రాములు, డైరెక్టర్లు సాయా గౌడ్‌, రామలింగం, అట్టెం సత్తవ్వ, శ్రీకాంత్‌రెడ్డి, సిద్ధి రాము లు ఎంపీటీసీలు ఉన్నారు.

Updated Date - 2021-04-19T04:11:29+05:30 IST