పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోండి

ABN , First Publish Date - 2022-01-28T04:21:28+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ జీవోలను వెంటనే వెనక్కి తీసుకోవాలని పీఆర్సీ సాధన సమితి నాయకులు డిమాండ్‌ చేశారు. రివర్స్‌ పీఆర్సీకి వ్యతిరేకంగా శ్రీకాకుళం నగరంలోని ఎన్జీవో హోమ్‌ వద్ద గురువారం నిరవఽధిక నిరాహార దీక్ష చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి 200 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు తరలివచ్చి ఈ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఆర్సీ సాధన సమితి ప్రతినిధులు మాట్లాడుతూ, కొత్త పీఆర్సీ ప్రకారం ఈ నెల జీతాల బిల్లులు తయారు చేయవద్దని.. పాత పద్ధతిలోనే జీతాలను చెల్లించాలని కోరారు.

పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోండి
నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్న ఉద్యోగులు

 పాత పద్ధతిలోనే జీతాలు చెల్లించాలి

 సాధన సమితి డిమాండ్‌

 శ్రీకాకుళంలో నిరవధిక నిరాహార దీక్ష

గుజరాతీపేట, జనవరి 27: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ జీవోలను వెంటనే వెనక్కి తీసుకోవాలని పీఆర్సీ సాధన సమితి నాయకులు డిమాండ్‌ చేశారు. రివర్స్‌ పీఆర్సీకి వ్యతిరేకంగా శ్రీకాకుళం నగరంలోని ఎన్జీవో హోమ్‌ వద్ద గురువారం నిరవఽధిక నిరాహార దీక్ష చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి 200 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు తరలివచ్చి ఈ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఆర్సీ సాధన సమితి ప్రతినిధులు మాట్లాడుతూ, కొత్త పీఆర్సీ ప్రకారం ఈ నెల జీతాల బిల్లులు తయారు చేయవద్దని.. పాత పద్ధతిలోనే జీతాలను చెల్లించాలని కోరారు. గడిచిన ఐదేళ్లలో నిత్యావసర సరుకులు, పెట్రోలు, తదితర ధరలు భారీగా పెరిగాయ న్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు సరిపడా పీఆర్సీని ప్రకటిస్తే తప్పేంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతి ఐదేళ్లకు కాకుండా పదేళ్లకు ఒకసారి పీఆర్సీని ప్రకటిస్తామనడం దారుణమన్నారు. కొత్త పీఆర్సీ ప్రకారం ఒక్కో ఉద్యోగికి సుమారు రూ.9వేల వరకు జీతం తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 14 ఏళ్లలో ఇంటి అద్దెలు ఏ స్థాయిలో పెరిగాయో ప్రభుత్వ పెద్దలకు తెలియదా? అని ప్రశ్నించారు. ఉద్యోగులపై  చిన్నచూపు తగదన్నారు. ఇప్పటికైనా  నూతన పీఆర్సీ జీవోలను ఉపసంహరించుకోవాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. నాలుగు రోజుల పాటు శాంతియుత వాతావరణంలో నిరవధిక దీక్షలను  కొనసాగించనున్నట్టు ఏపీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు చౌదరి పురుషోత్తంనాయుడు తెలిపారు. ఈ దీక్షలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీజేఏసీ జిల్లా శాఖ చైర్మన్‌ హనుమంతు సాయిరాం, ఏపీఎన్జీవో(అమరావతి) చైర్మన్‌ ఐ.నారాయణరావు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు పప్పల వేణుగోపాలరావు, బి.శ్రీరాములు, యూటీఎఫ్‌, డీటీఎఫ్‌, పీఆర్‌టీయూ, ఫోర్టో, ఏపీటీఎఫ్‌ల ప్రతినిధులు ఎస్‌.కిశోర్‌, చౌదరి రవీంద్ర, జి.గిరిధర్‌, అప్పారావు, కోత ధర్మారావు, పి.మురళి, పప్పల రాజశేఖర్‌, పిసిని వసంతరావు, టెంక చలపతిరావు, గోవిందపట్నాయక్‌, రాజ్‌కుమార్‌, శశిభూషణ్‌, సురేంద్ర, బీవీఎం రాజు, చిట్టిబాబు, ఏపీఎన్జీవో జిల్లా కార్యదర్శి పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-28T04:21:28+05:30 IST