తస్మాత్‌ జాగ్రత్త!

ABN , First Publish Date - 2020-04-05T11:11:19+05:30 IST

‘జిల్లాలో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.. ఇళ్లు వది లి ఎవరూ బయటకు రావద్దు.. కరోనా పాజిటివ్‌ కేసు ల సంఖ్య పెరిగింది.. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు

తస్మాత్‌ జాగ్రత్త!

జిల్లాలో పరిస్థితి సీరియస్‌గా ఉంది

కరోనా పాజిటివ్‌ల సంఖ్య 19కి చేరింది

కరోనాతో మరొకరు మృతిచెందారు

ఇళ్లు వదిలి ఎవరూ బయటకు రావద్దు

విలేకరుల సమావేశంలో నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ


నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘జిల్లాలో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.. ఇళ్లు వది లి ఎవరూ బయటకు రావద్దు.. కరోనా పాజిటివ్‌ కేసు ల సంఖ్య పెరిగింది.. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేప డుతోంది.. ప్రజలు సహకరించాలి.. ప్రధానంగా యువ కులను బయటకు పంపొద్దు..’ అని కలెక్టర్‌ సి. నారా యణరెడ్డి పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో శనివారం సీపీ కార్తికేయతో కలిసి మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఢిల్లీలోని మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారికే ఎక్కువగా ఈ వైరస్‌ సోకిందన్నారు. జిల్లా నుంచి 42 శాంపిళ్లను పం పించగా 17మందికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. జిల్లాలో ఇప్పటికి పాతవి రెండు కలుపుకుని మొత్తం 19 కేసు లు నమోదయ్యాయన్నారు. కరోనా లక్షణాలతోనే ఎల్ల మ్మగుట్టకు చెందిన వ్యక్తి మృతి చెందాడని కలెక్టర్‌ తెలి పారు. సదరు వ్యక్తిని జ్వరం, ఇతర లక్షణాలతో ఉద యం ఆసుపత్రికి తీసుకురాగా వైద్యం అందించేలోపే ఆయన మృతి చెందాడన్నారు.


ఆయన ఏ ప్రయాణా లు చేయలేదన్నారు. కరోనా వచ్చిన వారితో ఉన్న పరి చయంతోనే ఆయనకు వైరస్‌ సోకినట్లు గుర్తించామని కలెక్టర్‌ తెలిపారు. ప్రజలు కరోనాను సీరియస్‌గా తీసు కోవాలన్నారు. ముఖ్యంగా యువత బయటకు రాకుం డా ఇంటివాళ్లు చూడాలన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఎక్కువగా పిల్లలే బయటికు వస్తున్నారన్నారు. వారికి వైరస్‌ సోకితే వారికి కరోనా రాకున్నా ఇంట్లో వాళ్లకు అంటుకునే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు సీరియస్‌గా తీసుకోవాలన్నారు. లేకుంటే పరిస్థితి మరింత ఇబ్బందిగా తయారవుతుందన్నారు. 


నగరంతో పాటు మాక్లూర్‌లో కేసులు..

నగరంలోని ఖిల్లారోడ్‌, ఎల్లమ్మగుట్ట, హబీబ్‌నగర్‌, అహ్మద్‌నగర్‌, చంద్రశేఖర్‌ కాలనీ, ఆటోనగర్‌, ముజా హిద్‌నగర్‌, అర్సపల్లి, మాలపల్లిలతో పాటు మాక్లూర్‌ లో కరోనా కేసులు బయటపడ్డాయన్నారు. ఈ ప్రాంతా ల్లో కిలో మీటర్‌ మేర ఇంటింటి సర్వే చేస్తున్నామన్నా రు. సర్వేకు ప్రజలందరూ సహకరించాలన్నారు. వైరస్‌ లక్షణాలు ఉన్నట్టు అనుమానం వస్తే టోల్‌ఫ్రీ నెంబర్‌ కు తెలపాలన్నారు. 


మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారి గుర్తింపు..

జిల్లా నుంచి మర్కజ్‌కు వెళ్లివచ్చిన 57 మందిని గుర్తించామని కలెక్టర్‌ తెలిపారు. వారందరినీ క్వారంటై న్‌కు తరలించామన్నారు. వారిలో ఒకరు నాలుగు రోజు ల క్రితం చనిపోయారని. ఇంకొకరు ఢిల్లీలో ఉన్నారని తెలిపారు. వీరు కలిసిన ప్రైమరీ కాంటాక్ట్‌లు 305 మంది, సెకండరీ కాంట్రాక్ట్‌ 293 మందిని హోం క్వారం టైరరన్‌ చేశామన్నారు. జిల్లాలో ప్రస్తుతం వివిధ క్వార ంటైన్‌లతో పాటు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో మొత్తం 251మంది ఉన్నారన్నారు. వీరిలో 43 మందివి రక్త న మూనాలను సీసీఎంబీకి శనివారం పంపించామన్నా రు. మిగతా వారివి ఆదివారం పంపిస్తామన్నారు. సీసీ ఎంబీలో జిల్లాకు ఆదివారం సమయం ఇచ్చారన్నారు. దానికి అనుగుణంగానే రక్తనమూనాలను తీసి పంపి స్తామన్నారు.  ప్రస్తుతం పంపించిన రక్తనమూనాలలో మరికొన్ని కేసులు బయటపడే అవకాశాలు ఉన్నాయ న్నారు. కరోనా కట్టడికి  ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం చెప్పడమే కాకుండా తగిన చర్యలు తీసుకుందన్నారు. ఆసుపత్రులలో తగినఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అదే రీతిలో ప్రజలు కూడా సహకరించాలన్నారు. యంత్రాం గానికి అడిగిన సమాచారాన్ని అందించాలని కలెక్టర్‌ కోరారు. 


ఢిల్లీకి వెళ్లివచ్చిన వారు స్వచ్ఛందంగా ప్రభుత్వ ఆసుపత్రికి రావాలి..

ఢిల్లీకి వెళ్లివచ్చిన వారు ఇంకా ఎవరైనా ఉంటే స్వ చ్ఛందంగా ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని కలెక్టర్‌ కోరా రు. రక్తపరీక్షలు చేయించుకోవాలన్నారు. వారు ఇళ్లలో ఉంటే చాలా ప్రమాదమని, ఈ విషయాలు తెలిసిన వారు వారికి సమాచారం అందించాలని కోరారు. ప్రజ లు సీరియస్‌గా తీసుకోకపోతే మరింత ప్రమాదం ఎ దుర్కొనే అవకాశం ఉందని, మరో 15 రోజుల పాటు ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. జిల్లాలో విదేశాల నుంచి వచ్చిన వారు 3,763 మంది ఉన్నారని  కలెక్టర్‌ తెలిపారు. వీరు ప్రస్తుతం హోంక్వారంటైన్‌లో ఉన్నార న్నారు. వీరిలో ఎవరికీ కరోనా లక్షణాలు బయ టపడ లేదన్నారు. లాక్‌డౌన్‌ ముగిసేంత వరకు వారిని ఇళ్లకే పరిమితం చేశామన్నారు. అప్పటి వరకు వారిని అబ్జ ర్వేషన్‌లో ఉంచుతామని కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలోని మెడికల్‌ షాపుల యజమానులు ప్రిస్ర్కిప్షన్‌ ఉంటేనే మందులు విక్రయించాలన్నారు. జలుబు, దగ్గుతో వస్తే ఆసుపత్రికి పంపించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్‌ఎంపీలు, పీఎంపీలు కూడా కరోనా లక్షణాలతో వచ్చే వారిని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించాలని 

కలెక్టర్‌ నారాయణరెడ్డి కోరారు.  


బయటకు వస్తే కేసులే.. సీపీ కార్తికేయ

కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ సమ యంలో పనులు లేకుండా బయటకు వస్తే కేసులు నమోదు చేస్తామని సీపీ కార్తికేయ అన్నారు. అవసరాలకు అనుగుణంగా ఇంటి నుంచి ఒకరు మాత్రమే బయటకు రావాల న్నారు. ఇంట్లో మహిళలు ముందుకు వచ్చి తమ పిల్లలు బయటకు రాకుండా చూడాల న్నారు. వారిని పట్టించుకోకుంటే వైరస్‌ ఇం ట్లో వారందరికీ వస్తుందన్నారు. యువకుల ను పూర్తిగా కట్టడి చేసి బయటకు రాకుం డా చూడాలన్నారు. నిత్యావసర వస్తువుల కోసం ఒకేసారి బయటకు రాకుండా సా యంత్రం వరకు తీసుకోవచ్చన్నారు. ఉద యం పూటనే ఎక్కువమంది బయటకు వ స్తున్నారన్నారు. ప్రభుత్వం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సమయం ఉన్నందున తొందరప డొద్దన్నారు. ఒకసారి బయటకు వస్తే నాలు గు రోజులకు సరిపడా సామగ్రిని తీసుకు వెళ్లాలని సూచించారు. పదేపదే బయటకు రావద్దని సీపీ విజ్ఞప్తి చేశారు. అవసరం లే కున్నా బయటకు వచ్చే వారిపై కేసులు న మోదు చేస్తున్నామన్నారు.


జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 1,900 వాహనాలను సీజ్‌ చేశామని, 50కి పైగా కేసులను నమోదు చేశామన్నారు. ఉద్యోగుల విధులకు ఆటం కం కలిగించేవారిపై కూడా కేసులు పెట్టా మన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నాలుగు రోజుల కిందట జరిగిన సంఘటనపై కూడా కేసు నమోదుచేశామన్నారు. కరోనా వైరస్‌ తీవ్రత నగరంలో ఎక్కువగా ఉన్నందున ముగ్గురు అదనపు డీసీపీలతోపాటు ఇద్దరు డీఎస్పీలను ప్రత్యేకంగా నియమించామ న్నారు. వీరితోపాటు నగర ఏసీపీ పూర్తి స్థా యి విధులు నిర్వర్తిస్తున్నారన్నారు.


ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రత కోసం ప్రత్యేకంగా ఒక డీఎస్పీని నియమించామన్నారు. జిల్లావ్యా ప్తంగా ఉన్న క్వారంటైన్లలో సీఐ, ఎస్‌ఐ వం టి అధికారులను ఇన్‌చార్జిలుగా నియమిం చామని తెలిపారు. ఎక్కడ నిబంధనలు ఉ ల్లంఘించినా కేసులు నమోదుచేస్తామన్నా రు. శిక్ష పడితే మూడు నుంచి నాలుగేళ్ల వ రకు జైలునుంచి బయటకు రారని, ఈ విష యాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. కాలనీల్లో కూడా ఎక్కువ వాహనాలు తిరగ కుండా కాలనీ పెద్దలు చర్యలు చేపట్టాలన్నా రు. మహిళలు ముందుకు వస్తే పిల్లలు బ యటకు రావడం తగ్గుతుందని, ప్రతీఒక్కరు సీరియస్‌గా తీసుకుని సహకరించాలని సీపీ కోరారు. ఈ విలేకరుల సమావేశంలో అడి షనల్‌ డీసీపీ రఘువీర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-05T11:11:19+05:30 IST