‘కబ్జాలకు గురైన భూములను స్వాధీనం చేసుకోవాలి’

ABN , First Publish Date - 2021-03-05T05:17:49+05:30 IST

మండల కేంద్రంలో గ్రామ పంచాయతీకి రాంమందిర్‌ ఆలయానికి సంబంధించిన భూములు కబ్జాకు గురవుతున్నాయని, వాటిని గ్రామ పంచాయతీ స్వాధీనం చేసుకోవాలని సీపీఎం నాయకులు నాగరపు ఎల్లయ్య గురువారం దోమకొండ జీపీ ఎదురుగా కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.

‘కబ్జాలకు గురైన భూములను స్వాధీనం చేసుకోవాలి’


దోమకొండ, మార్చి 4: మండల కేంద్రంలో గ్రామ పంచాయతీకి రాంమందిర్‌ ఆలయానికి సంబంధించిన భూములు కబ్జాకు గురవుతున్నాయని, వాటిని గ్రామ పంచాయతీ స్వాధీనం చేసుకోవాలని సీపీఎం నాయకులు నాగరపు ఎల్లయ్య గురువారం దోమకొండ జీపీ ఎదురుగా కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమకొండ గ్రామ పంచాయతీ ఎదురుగా అక్రమంగా నిర్మాణం చేపడుతున్నారని, ప్రభుత్వ భూములు కబ్జా చేసుకుని దర్జగా పనులు కొనసాగిస్తున్నరని, వాటిపై పూర్తి నివేదికను పరిశీలించి అక్రమ కట్టడాలను తొలగించి అట్టి భూములను గ్రామ పంచాయతీ స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. దోమకొండలోని శివరాంమందిర్‌ ఆలయం ఆవరణలోని దేవునికుంటలో అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా భూములు కబ్జా చేసుకుని నిర్మాణాలు చేపట్టారని, వాటిని వేంటనే కూల్చివేసి భూమిని ఆలయం పరిధిలోకి తేవాలని కోరారు. లేదంటే సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.


Updated Date - 2021-03-05T05:17:49+05:30 IST