వేసవికి ముందస్తు చర్యలు చేపట్టాలి

ABN , First Publish Date - 2021-03-02T05:18:12+05:30 IST

వేసవికి ముందస్తు చర్యలు చేపట్టాలి

వేసవికి ముందస్తు చర్యలు చేపట్టాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పౌసుమిబసు

వికారాబాద్‌ : వేసవిలో సంభవించే ప్రకృతి వైపరీత్యాల వల్ల న ష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ పౌసుమిబసు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా  చూడాలన్నారు. వాటర్‌ ట్యాంకులను శుభ్రంగా కడిగి క్లోరినేషన్‌ చేయాలని అన్నారు.  ఉపాధి కూలీలకు వడదెబ్బ తగలకుండా షామియానాలు, నీటి సదుపాయం తదితర ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. రోడ్లపై తిరిగే అనాధలను ఆశ్రయం కోసం ప్రత్యేక షెల్టర్‌ ఏర్పాటు చేయాలని, వెనుకబడిన ప్రాంతాల్లో కనీసం వారానికి ఒకసారి మెడికల్‌ క్యాంపులు నిర్వహించాలన్నారు. మునిసిపల్‌ పరిధిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని,  పశుగ్రాసం కోసం గడ్డిని పెంచాలని తెలిపారు. రైతువేదికల ద్వారా రైతులు సాగు చేయాల్సి పంటలు, పశు సంరక్షణ తదితర అంశాలపై సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని కోరారు. విద్యుత్‌ అంతరాయం, షాట్‌ సర్క్యూట్‌లు జరగకుండా చూడాలని, జిల్లాలో  అగ్ని ప్రమాదాలు జరగకుండా  ఆశాక యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌, అధికారులు పాల్గొన్నారు. 

వంద శాతం పింఛన్‌ పంపిణీ జరగాలి

 గ్రామ కార్యదర్శుల సహకారంతో వృద్ధులు, దివ్యాంగులకు సంబంధించిన ఆసరా పింఛన్లను గ్రామాలలో ఎప్పటికప్పుడు వందశాతం పంపిణీ చేయాలని కలెక్టర్‌ అన్నారు. కలెక్టరేట్‌లో పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌, డీపీఎం, ఎస్‌పీఎంలతో ఆసరా పింఛన్ల పంపిణీపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో ప్రస్తుతం 90శాతం పింఛన్లు పంపిణీ జరుగుతుందని, ఇకనుంచి వంద శాతం పంపిణీ జరగాలని సూచించారు. ఇక నుంచి ప్రతీనెల చివరి బుధవారం ఆసరా పింఛన్ల పంపిణీపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. డీఆర్డీవో కృష్ణన్‌, ఏపీవో లక్ష్మి పాల్గొన్నారు.

జిల్లాలో రెండో విడత కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ 

 జిల్లాలో రెండో విడత కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభమైందని కలెక్టర్‌ పౌసుమిబసు తెలిపారు. తాండూరు ప్రభుత్వాసుపత్రిలోని కొవిడ్‌సెంటర్‌లో 200 మందికి ఉచితంగా వ్యాక్సిన్‌, అలాగే వికారాబాద్‌లోని మహవీర్‌ ప్రైవేటు ఆసుపత్రిలో 150 మందికి రూ.250 చెల్లించిన వారికి మాత్రమే వ్యాక్సిన్‌ వేయడం జరుగుతుందని తెలిపారు. 60 సంవత్సరాలు దాటిన వారందరికీ వ్యాక్సిన్‌ వేయడానికి ఎలాంటి నిబంధనలు లేవని, ఆధార్‌కార్డు సరిపోతుందని తెలిపారు. 45-59 సంవత్సరాల వారు దీర్ఘకాలిక వ్యాధులతో మందులు వాడుతున్న వారు తప్పనిసరిగా వైద్యుడి నుంచి ధ్రువపత్రం పొందాల్సి ఉంటుందన్నారు. కొవిన్‌.జీవోవి.ఇన్‌లో స్లాట్‌బుక్‌ చేసుకున్న వారికి మాత్రమే వ్యాక్సిన్‌ వేయనున్నట్లు  తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో సుధాకర్‌షిండే, డిప్యూటీ డీఎంహెచ్‌వో జీవరాజ్‌, డాక్టర్‌ అరవింద్‌ పాల్గొన్నార

Updated Date - 2021-03-02T05:18:12+05:30 IST