Advertisement
Advertisement
Abn logo
Advertisement

ధాన్యాన్ని అమ్మించే బాధ్యత తీసుకోవాలి

మిర్యాలగూడ ఎమ్మెల్యేకు జూలకంటి సూచన

మిర్యాలగూడ, డిసెంబర్‌ 3: యాసంగిలో అన్ని రకాల వరి ధాన్యాన్ని అమ్మించే బాధ్యత ఎమ్మెల్యే తీసుకోవాలని  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాసంగిలో రైతులకు వరి పంట వేసుకొమ్మని హమీ ఇచ్చిన ఎమ్మెల్యే భాస్కర్‌రావు 1010, 1001, ఆర్‌ఎన్‌ఆర్‌, బతుకమ్మ వంటి దొడ్డు రకాల ధాన్యాన్ని అమ్మించే బాధ్యత తీసుకోవాలని అన్నారు. కరెంట్‌ కోతలు లేకుండా సాగుకు నిరంతరం విద్యుత్‌ను అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ధాన్యం ధరలను మిల్లర్లు తగ్గించి కొనుగోలు చేస్తున్నారని అ న్నారు. గతంలో  క్వింటాకు రూ.1850కి కొనుగోలు చేస్తారని ఎమ్మెల్యే చెప్పిన వట్టి మాటేనన్నారు. మద్దతు ధర కంటే రూ.200 నుంచి 400 వరకు తక్కువకు రైతుల వద్ద మిల్లర్లు కొనుగోలు చేశారన్నారు. తక్కువ ధరకు ధాన్యం అమ్ముకున్న రైతుల వద్ద బిల్లులు చూపి మద్దతు ధర ఇప్పించి ఆదుకోవాలన్నారు. యాసంగిలో వరి పంట సాగుకు కరెంటు, ఎడమకాల్వకు నీరును విడుదల చేసేలా ప్రభుత్వం ప్రకటన చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సీపీఎం నాయకులు డబ్బికార్‌ మల్లేష్‌, వీరేపల్లి వెంకటేశ్వర్లు, మల్లు గౌతంరెడ్డి, రవినాయక్‌, ఐద్వా నాయకురాలు గాదె పద్మమ్మ పాల్గొన్నారు.


Advertisement
Advertisement