‘ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రత్యేకచర్యలు చేపట్టండి’

ABN , First Publish Date - 2021-02-25T06:17:23+05:30 IST

జిల్లాలోని భూ సంబంధిత, ఇతరత్రా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేకచర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ తహసీల్దార్‌లను ఆదేశించారు.

‘ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రత్యేకచర్యలు చేపట్టండి’
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

నిర్మల్‌ టౌన్‌, ఫిబ్రవరి 24 : జిల్లాలోని భూ సంబంధిత, ఇతరత్రా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేకచర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ తహసీల్దార్‌లను ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయ సమా వేశ మందిరంలో రెవెన్యూ, ఇతర ప్రజాసమస్యలపై తహసీల్దార్‌లతో నిర్వ హించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ మాట్లాడుతూ జిల్లాలో భూ సంబంధిత ఇతర ప్రజా రెవెన్యూసమస్యల పరిష్కారానికి ప్రత్యేకచర్యలు చేపట్టి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణిలో ఫిర్యా దులు అధికంగా గ్రామీణ ప్రాంతాల నుండి వస్తున్నాయని తెలిపారు. మండల స్థాయిలో తహసీల్దార్లు సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని, తమ పరిధిలో పరిష్కారం కాని వాటిని మాత్రమే కలెక్టర్‌ కార్యాలయానికి పం పించాలన్నారు. ట్రిబ్యునల్‌ కోర్టు పెండింగ్‌ కేసులు, డి-1 పట్టాలకు సంబంధించి ప్రభుత్వరికార్డుల ప్రకారం ప్రత్యేకసర్వే చేయించి పరిష్కరించాలని సూచిం చారు. మండలాల వారీగా గ్రామీణ ప్రాంతాలలో నిర్మాణంలో ఉన్న రెండు పడక గదుల ఇళ్లను వేగవంతంగా పూర్తి చేయాలని, పంచాయతీరాజ్‌, రోడ్డు భవనాల శాఖ, ఇంజనీరింగ్‌ అధికారులు, గుత్తేదారులను సమన్వయం చేసి నిర్మాణంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూ చించారు. ఇప్పటికే పూర్తయిన ఇళ్లలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా చేపట్టాలన్నారు. అనంతరం రెవెన్యూ ఇతరత్రా అంశాలపై మండలాల వారీగా చర్చించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి రాథోడ్‌ రమేష్‌, జిల్లా సర్వేశాఖ అధికారి దశ రథ్‌, కలెక్టర్‌ కార్యాలయ పరిపాలన అధికారి కరీం, తహసీల్దార్లు సుభాష్‌ చంద ర్‌, విశ్వంబర్‌, ప్రభాకర్‌, లోకేష్‌, శ్రీకాంత్‌, శివకుమార్‌, రాజ్‌మోహన్‌, కిరణ్మయి, కవిత, ఈడీఎం నదీమ్‌, తదితరులు పాల్గొన్నారు. 

ఎంపీడీవో పై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్‌

ముథోల్‌ : తరోడ,చించాల గ్రామాలల్లో  బుధవారం జిల్లా కలెక్టర్‌ ముషారప్‌ ఆలీ ఫారుఖీ, అకస్మిక తనిఖీ చేశారు. పంచాయితీలపై పర్యవేక్షణ సక్రమంగా లేక పోవడంపై ఎంపీడీవో సురేష్‌బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


Updated Date - 2021-02-25T06:17:23+05:30 IST