Advertisement
Advertisement
Abn logo
Advertisement

కాంగ్రెస్‌కు షాక్‌ ఇచ్చిన టేక్మాల్‌ ఎంపీపీ

  టీఆర్‌ఎస్‌లో చేరిన స్వప్న, ఆమె భర్త


ఆంద్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, నవంబరు 27: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ అభ్యర్థికి అండగా ఉండి ఓటేస్తారనుకున్న టేక్మాల్‌ ఎంపీపీ స్వప్న, ఆమె భర్త రవి కాంగ్రె్‌సను వీడి శనివారం మంత్రి హరీశ్‌రావు సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఆందోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ చొరవతో ఎంపీపీ స్వప్న శనివారం హైదరాబాద్‌కు వెళ్లి మంత్రిని కలిశారు. అనంతరం మంత్రి వారికి గులాబీ కండువా కప్పి టీఆర్‌ఎ్‌సలోకి ఆహ్వానించారు. అన్ని విధాలుగా అండగా ఉంటూ, టేక్మాల్‌ మండల అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిసింది. కార్యక్రమంలో ఆందోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ పాల్గొన్నారు.


 

Advertisement
Advertisement