జూనియర్‌ డాక్టర్లలో కాంగ్రెస్‌ బ్యాచ్‌!

ABN , First Publish Date - 2020-04-09T09:32:26+05:30 IST

కొంత మంది జూనియర్‌ డాక్టర్లు ఒక బ్యాచ్‌గా ఏర్పడ్డారు. అది కాంగ్రెస్‌ బ్యాచ్‌. విరాళాలు వస్తే నొక్కేద్దామనే ఇలా చేస్తున్నారేమో?’’ అని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద బుధవారం ఆయన మాట్లాడారు. 5 లక్షల పీపీఈ కిట్లు ఆర్డర్‌ ఇచ్చామని

జూనియర్‌ డాక్టర్లలో కాంగ్రెస్‌ బ్యాచ్‌!

విరాళాలు నొక్కుదామనేమో?: తలసాని


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): ‘‘కొంత మంది జూనియర్‌ డాక్టర్లు ఒక బ్యాచ్‌గా ఏర్పడ్డారు. అది కాంగ్రెస్‌ బ్యాచ్‌. విరాళాలు వస్తే నొక్కేద్దామనే ఇలా చేస్తున్నారేమో?’’ అని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద బుధవారం ఆయన మాట్లాడారు. 5 లక్షల పీపీఈ కిట్లు ఆర్డర్‌ ఇచ్చామని, ఇంకా కొన్ని రావాల్సి ఉందని చెప్పారు. తాము ఇంత చేస్తుంటే ఇలాంటి ప్రకటనలు చేయడం సబబేనా? అని ప్రశ్నించారు. ఏదైనా సమస్య ఉంటే మంత్రి ఈటలకు చెప్పుకోవాలని సూచించారు. అనవసర సమస్యలు సృష్టిస్తే వారికే నష్టమని హెచ్చరించారు. కాగా, కరోనాపై వస్తున్న వార్తల గురించి సీఎం కేసీఆర్‌ మాట్లాడారని, అందులో తప్పేముందని తలసాని ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలపై కొందరు చేతకాని దద్దమ్మలు.. ఇప్పుడు వచ్చి గాలి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ వాళ్లు ఎక్కువ మాట్లాడితే... తెలంగాణ తమ జాగీరేనని అన్నారు. అయినా, బుద్ధి, జ్ఞానం లేని వాళ్లతో ఏం మాట్లాడుతామని విరుచుకుపడ్డారు.

Updated Date - 2020-04-09T09:32:26+05:30 IST