రోజుకి 40 కిరాణ దుకాణాలకు అనుమతి: తలసాని

ABN , First Publish Date - 2020-03-26T20:41:53+05:30 IST

హైదరాబాద్: తెలంగాణలో రిటైల్, కిరాణా దుకాణదారులకు హోల్‌సేల్ ధరలకు బేగంబజార్, ముక్తర్ గంజ్, కిషన్‌గంజ్ మార్కెట్ల నుంచి నిత్యం నిత్యావసర సరుకులు సరఫరా అవుతుంటాయి.

రోజుకి 40 కిరాణ దుకాణాలకు అనుమతి: తలసాని

హైదరాబాద్: తెలంగాణలో రిటైల్, కిరాణా దుకాణదారులకు హోల్‌సేల్ ధరలకు బేగంబజార్, ముక్తర్ గంజ్, కిషన్‌గంజ్ మార్కెట్ల నుంచి నిత్యం నిత్యావసర సరుకులు సరఫరా అవుతుంటాయి. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌లో భాగంగా హోల్‌సేల్ దుకాణాలు బంద్ ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.


ఈ నేపథ్యంలో హైద్రాబాద్ కిరాణా మార్చంట్స్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపినాధ్, రాజాసింగ్‌లతో కలసి బేగంబజార్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. వ్యాపారుల అభ్యర్థన మేరకు రోజుకి 40కిరాణా షాపులకు తగిన నిబంధనలతో 11గంటల నుంచి 3గంటల వరకు డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా అనుమతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఎక్కువ మంది గుమికూడకుండా వ్యాపారస్తులు తగు చర్యలు తీసుకోవాలని తలసాని సూచించారు.



Updated Date - 2020-03-26T20:41:53+05:30 IST