రంగనాయక సాగర్‌లో చేప, రొయ్య పిల్లలను వదిలిన మంత్రులు

ABN , First Publish Date - 2021-09-08T16:32:18+05:30 IST

రంగనాయక సాగర్‌లో వంద శాతం సబ్సిడీతో చేప, రొయ్య పిల్లలను మంత్రులు తలసాని, హరీష్ రావు వదిలారు.

రంగనాయక సాగర్‌లో చేప, రొయ్య పిల్లలను వదిలిన మంత్రులు

సిద్దిపేట జిల్లా: చిన్న కోడూరు మండలంలోని రంగనాయక సాగర్‌లో వంద శాతం సబ్సిడీతో చేప, రొయ్య పిల్లలను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీష్ రావు వదిలారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడానికి ఉచిత చేప పిల్లలు పంపిణీ చేస్తున్నామన్నారు. బుధవారం రంగనాయక సాగర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టామన్నారు. మత్స్యశాఖపై ఆధారపడ్డ ఇతర కులస్తులు కూడా ఆనందంగా జీవించాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. 


మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మత్స్యకారుల కుటుంబాలు సంతోషంగా ఉండాలని రూ. 93 కోట్లతో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. రూ. 4 కోట్ల 87లక్షల ఖర్చుతో.. 4 కోట్ల 19 లక్షల చేపలను అన్ని నీటి వనరుల్లో పంపిణీ చేపట్టామని తెలిపారు. ఒకప్పుడు త్రాగడానికి నీళ్ళు లేని ఈ ప్రాంతం ఇవాళ మత్తల్లు డుంకుతు పచ్చని పొలాలతో కళకళలాడుతున్నాయన్నారు. అప్పుడు చేపలను ఆంధ్ర నుంచి దిగుమతి చేసుకుంటే నేడు తెలంగాణ నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నామన్నారు. తెలంగాణ చేపలు రుచికరంగా, ఆరోగ్యంగా ఉంటాయని హరీష్‌రావు వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-09-08T16:32:18+05:30 IST