Abn logo
Sep 20 2021 @ 18:58PM

కులవృత్తులకు జీవం పోశాం: తలసాని

కరీంనగర్: గత పాలకుల నిర్లక్ష్యంతో అంతరించిపోయే స్థితికి చేరుకున్న కులవృత్తులకు సీఎం కేసీఆర్‌ జీవం పోశారని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా చేప పిల్లలు, సబ్సిడీపై గొర్రెలను అందించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో బీడు భూములు సస్యశ్యామలం అయ్యాయన్నారు. సంక్షేమ పథకాలకు ప్రాధాన్యమిస్తునే అభివృద్ధిపై దృష్టి సారించడంతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపామని తెలిపారు. కొన్ని పార్టీలు దళితులను ఓటర్లుగానే చూశాయని, దళితబంధు పథకంతో వారి జీవితాల్లో మార్పులు రాబోతున్నాయని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.  

ఇవి కూడా చదవండిImage Caption