Abn logo
Oct 21 2021 @ 23:32PM

విద్యార్థినులకు ప్రతిభా పురస్కారాలు

ప్రతిభా పురస్కారాలు పొందిన విద్యార్థినులతో కోరమాండల్‌ సంస్థ ప్రతినిధులు

కడప (ఎడ్యుకేషన్‌), అక్టోబరు 21 : గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదివి మొదటి, ద్వితీయ స్థానం వచ్చిన బాలికలకు కోరమండల్‌ సంస్థ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అందజేశారు. కడప నగరం ఐఎంఏ హాలులో గురువారం బహుమతులను విద్యార్థినులకు అందజేశారు. మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థినికి 5 వేలు, రెండో స్థానంలో నిలిచిన విద్యార్థినికి 3500 రూపాయలు ఇచ్చారు. పాఠశాల విద్య ఆర్జేడీ కృష్ణారెడ్డి చేతుల మీదుగా నగదు, పురస్కారాలు అందించారు. కార్యక్రమంలో కోరమాండల్‌ సంస్థ ప్రతినిధులు కె.ప్రదీప్‌కుమార్‌, భాస్కర్‌రెడ్డి, జేఎం మాధవన్‌, శివకుమార్‌ పాల్గొన్నారు.