Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎన్‌ఎస్‌ కళాశాల విద్యార్థుల ప్రతిభ


పెద్దారవీడు(మార్కాపురం), డిసెంబరు 2: ఆచార్య  ఎన్జీరంగా వ్యవసాయ విశ్వ విద్యాలయ కళాశాలల రాష్ట్ర స్థాయి క్రీడా, సాంస్కృతిక, సాహిత్య పోటీలు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఎస్‌కేవై వ్యవసాయ కళాశాలలో నవంబరు 19 నుంచి 23వ తేదీ వరకూ జరిగాయి. ఈ పోటీలలో మండలంలోని  ఎన్‌ఎస్‌ వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఏ.గోపి పరుగుపందెంలో, పి.సుప్రియ సాంస్కృతిక విభాగంలో తృతీయ బహుమతులు తొమ్మిందింటిన కైవసం చేసుకున్నారు. బహుమతులు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్‌ ఎన్‌.చంద్రమౌళి, అసోసియేట్‌ డీన్‌ మల్లికార్జునరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.


Advertisement
Advertisement