తాలిబన్లకు మొదలైన చిక్కులు.. అఫ్ఘానిస్థాన్‌లో కీలక పరిణామం!

ABN , First Publish Date - 2021-08-18T00:51:06+05:30 IST

అంతా ఊహించినట్టే జరుగుతోంది..అఫ్ఘానిస్థాన్‌లో విదేశీ టెర్రరిస్టులు కాలు పెట్టారు.

తాలిబన్లకు మొదలైన చిక్కులు.. అఫ్ఘానిస్థాన్‌లో కీలక పరిణామం!

న్యూఢిల్లీ: అంతా ఊహించినట్టే జరుగుతోంది! అఫ్ఘానిస్థాన్‌లో విదేశీ టెర్రరిస్టులు కాలు పెట్టారు. ఇస్లామిక్ స్టేట్, జైషే మహ్మద్, లష్కరే తయ్యబా ఉగ్ర సంస్థలకు చెందిన ముష్కరులు అఫ్ఘానిస్థాన్‌లో కొద్ది రోజుల క్రితం ప్రవేశించారు. ఓవైపు తాలిబన్లు ఆఫ్ఘాన్‌ను ఆక్రమించుకుంటుండగా వీరు సరిహద్దులు దాటి దేశంలోకి ప్రవేశించారు. ప్రస్తుతం కాబూల్‌లో విదేశీ టెర్రరిస్టులు ఉన్నట్టు జాతీయ మీడియా చెబుతోంది. తాలిబన్లకు ఈ విదేశీ శక్తులపై ఎటువంటి నియంత్రణా లేదని కూడా తెలుస్తోంది. 


అయితే.. వీరి రాకడ గురించి తాలిబన్లకు సమాచారం అందిందట. ఇక వీదేశీ ఉగ్రమూకలను కట్టడి చేసేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తే..ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగే అవకాశం కూడా లేకపోలేదని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అఫ్ఘానిస్థాన్‌ను ఉగ్ర కార్యకలాపాలకు కేంద్రంగా మారనివ్వమంటూ తాలిబన్లు అంతర్జాతీయ సమాజానికి హామీ ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో..అఫ్ఘాన్ పరిణామాలు మరో ఆందోళనకర మలుపు తిరిగాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. 

Updated Date - 2021-08-18T00:51:06+05:30 IST