యూరప్‌లో మొదటి అధికారిక మీటింగ్‌ నిర్వహించిన తాలిబన్

ABN , First Publish Date - 2022-01-25T03:30:53+05:30 IST

అఫ్ఘాన్‌కు రావాల్సిన నిధులను విడుదల చేయాలి. రాజకీయ కారణాలు చూపి అఫ్ఘాన్ నిధులను ఆపొద్దు. అఫ్ఘాన్‌లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. పైగా దీనికి తోడు చలికాలం మరింత ప్రభావం చూపించింది. పాశ్చాత్య దేశాల మధ్య ఏవైనా ఘర్షణలు..

యూరప్‌లో మొదటి అధికారిక మీటింగ్‌ నిర్వహించిన తాలిబన్

ఓస్లో: తాలిబన్ నేతలు సోమవారం నార్వేలో నిర్వహించిన ఓ మీటింగ్‌లో పాల్గొన్నారు. అఫ్ఘానిస్తన్‌ ప్రభుత్వాన్ని కూలదోసి స్వాధీనం చేసుకున్న అనంతరం యూరప్‌లో అధికారిక మీటింగ్‌లో పాల్గొనడం ఇదే మొదటిసారి. కాగా, అమెరికా సహా పాశ్చాత్య దేశాల నుంచి తమకు అందవలసిన 10 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని నిలిపివేయడం పట్ల తాలిబన్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అఫ్ఘాన్‌కు రావాల్సిన నిధులపై నిషేధాన్ని ఎత్తివేయాలని, అఫ్ఘాన్ పట్ల మానవత్వంతో వ్యవహరించాలని కోరారు. ‘‘అఫ్ఘాన్‌కు రావాల్సిన నిధులను విడుదల చేయాలి. రాజకీయ కారణాలు చూపి అఫ్ఘాన్ నిధులను ఆపొద్దు. అఫ్ఘాన్‌లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. పైగా దీనికి తోడు చలికాలం మరింత ప్రభావం చూపించింది. పాశ్చాత్య దేశాల మధ్య ఏవైనా ఘర్షణలు ఉంటే ఉండొచ్చు గాక, కానీ అప్ఘాన్‌కు రావాల్సిన నిధులను ఆపేయడం సరైంది కాదు’’ అని తాలిబన్ నేత ఒకరు అన్నారు.

Updated Date - 2022-01-25T03:30:53+05:30 IST