Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 28 2021 @ 09:25AM

Afghan:క్షురకులకు నో షేవ్ ఆర్డర్..తాలిబన్ల సంచలన ఆదేశాలు

కాబూల్ (అప్ఘానిస్థాన్): అధికారాన్ని హస్తగతం చేసుకున్నాక అప్ఘానిస్థాన్ దేశంలో తాజాగా తాలిబన్లు సంచలన ఆదేశాలు జారీ చేశారు. అఫ్ఘాన్ ప్రావిన్సులోని క్షౌరశాలలకు నో సేవ్ ఆర్డర్ జారీ చేశారు. దక్షిణ అప్ఘానిస్థాన్ ప్రావిన్సులోని బార్బర్ షాపుల్లో గడ్డం షేవింగ్ చేయడం, ట్రిమ్ చేయడాన్ని నిషేధించారు. ఇస్లామిక్ చట్టం షరియాకు అనుగుణంగా తాలిబన్లు ఈ ఆదేశాలు జారీ చేశారు.హెల్మాండ్ ప్రావిన్సులోని  రాజధాని నగరమైన లష్కర్ గాహ్ లో క్షౌరశాలలకు తాలిబన్లు నో షేవ్ ఆదేశాలు జారీ చేశారు. గడ్డం షేవ్ చేసుకోవడంపై నిషేధ ఉత్తర్వుల గురించి తెలిసి నా గుండె పగిలింది అని లష్కర్ గాహ్ నివాసి బిలాల్ అహ్మద్ చెప్పారు. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement