తాలిబాన్‌ ఉగ్రవాదుల కాల్పుల్లో 12 మంది అఫ్ఘాన్‌ సైనికుల హతం

ABN , First Publish Date - 2021-01-17T08:07:08+05:30 IST

అఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్‌ ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 12 మంది సైనికులను పొట్టనపెట్టుకున్నారు.

తాలిబాన్‌ ఉగ్రవాదుల కాల్పుల్లో  12 మంది అఫ్ఘాన్‌ సైనికుల హతం

కాబూల్‌, జనవరి 16: అఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్‌ ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 12 మంది సైనికులను పొట్టనపెట్టుకున్నారు. సైనిక స్థావరంలోకి చొచ్చుకుపోయిన ఇద్దరు తాలిబాన్‌ సాయుధులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

పశ్చిమ హీరాత్‌లో శుక్రవారం బాగా పొద్దుపోయాక ఈ ఘటన జరిగినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సైనికులు భోజనాలు చేస్తుండగా కాల్పులు జరిగాయని చెప్పాయి. 


Updated Date - 2021-01-17T08:07:08+05:30 IST