Abn logo
Sep 23 2021 @ 18:25PM

పీహెచ్‌డీ వద్దు... బీఏ ముద్దు.. తాలిబన్ తమాషా!

తాలిబన్లు ఆఫ్ఘానిస్థాన్ని ఆక్రమించాక అన్ని రంగాల్ని అతలాకుతలం చేసేస్తున్నారు. కేవలం హింస మాత్రమే కాదు, వారి వల్ల జరుగుతోన్న అరాచకాలు అన్నీఇన్నీ కావు. స్త్రీలు, పిల్లల సంగతైతే చెప్పే పనే లేదు. ఇక ఇప్పుడు తాలిబన్ పాలకుల కన్ను విద్యా రంగంపై కూడా పడింది. గతంలో ఉగ్రవాదులు అమ్మాయిలు, అబ్బాయిలు వేరు వేరు తరగతి గదుల్లో కూర్చోవాలంటూ ఫత్వాలు జారీ చేసిన సంగతి మనకు తెలిసింది. అయితే, తాజాగా కాబూల్ యూనివర్సిటిపై దృష్టి సారించారు.  


ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్‌లో ఉన్న ప్రధాన విశ్వవిద్యాలయంలో తాలిబన్ మార్కు మార్పులు మొదలయ్యాయి. ఇంతకాలం వైస్ ఛాన్సలర్‌గా ఉన్న మహ్మద్ ఒస్మాన్ బాబూరి స్థానంలో కొత్తగా మహ్మద్ అష్రఫ్ గైరట్‌ను నియమించారు. ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే, తొలగించబడ్డ వైస్ ఛాన్సలర్ విద్యార్హత పీహెచ్‌డీ. కొత్త వీసి క్వాలిఫికేషన్... బీఏ మాత్రమే!


జస్ట్ డిగ్రీ చదివిన వ్యక్తిని తెచ్చి కాబూల్ యూనివర్సిటి వైస్ ఛాన్సలర్ చేయటం అనేక విమర్శలకు దారి తీస్తోంది. ఇప్పటికే 70 మంది వరకూ విశ్వవిద్యాలయ బోధనా సిబ్బంది రాజీనామాలు కూడా చేసేశారు. అన్నిటికంటే ముఖ్యంగా, తాలిబన్ పాలకుల నిర్ణయం చాలా మంది తాలిబన్ మద్దతుదారులకు కూడా నచ్చటం లేదట. దీనిపై సొషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. కానీ, కాబూల్ యూనివర్సిటి ‘బీఏ వైస్ ఛాన్సలర్’ ఇప్పట్లో మారతాడని ఆశించటం... అత్యాశే అవుతుంది! తాలిబన్లు అంత తేలిగ్గా మనసు మార్చుకోరు కదా...     

  

ఇవి కూడా చదవండిImage Caption