Taliban: చైనా మాకు దోస్తీయే

ABN , First Publish Date - 2021-09-03T22:19:00+05:30 IST

చైనా విషయంలో తాలిబాన్ ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు చైనా అత్యంత కీలమైన భాగస్వామ్య దేశమని తాలిబాన్ ప్రతినిధి

Taliban: చైనా మాకు దోస్తీయే

న్యూఢిల్లీ : చైనా విషయంలో తాలిబాన్ ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు చైనా అత్యంత కీలమైన భాగస్వామ్య దేశమని తాలిబాన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ప్రకటించారు.  ఆఫ్గనిస్తాన్ పునర్నిర్మాణానికి తాము బీజింగ్ వైపు చూస్తున్నామని అన్నారు. ‘‘చైనా మాకు ప్రధాన భాగస్వామి. మా దేశంలో కీలకమైన పెట్టుబడులు పెట్టి, దేశ పునర్నిర్మాణానికి చైనా దోహదపడుతుంది. ఇందుకు ఆ దేశం సిద్ధంగా ఉంది’’ అని జబిహుల్లా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆఫ్గనిస్తాన్‌లో చాలా రాగి నిక్షేపాలు ఉన్నాయని, వాటిని వెలికి తీయడంలోనూ చైనా తమకు తోడ్పాటునందిస్తుందని, దీని ద్వారా చైనా కూడా లాభపడుతుందని అన్నారు. దీని ద్వారా గనుల ఆధునికీకరణ కూడా సాధ్యమవుతుందని, దీని ద్వారా ప్రపంచ మార్కెట్‌ను అందుకోవడం తమకు సులభమవుతందని ఆయన తెలిపారు. అంతేకాకుండా చైనా సృష్టించిన ‘వన్ బెల్ట్, వన్ రోడ్ ప్రాజెక్టును పూర్తిగా సమర్థిస్తున్నామని జబిహుల్లా ముజాహిద్ తెలిపారు.  

Updated Date - 2021-09-03T22:19:00+05:30 IST