Kabul airport: అమెరికన్ పౌరులకు ఎంబసీ హెచ్చరిక

ABN , First Publish Date - 2021-08-26T13:14:47+05:30 IST

అఫ్ఘానిస్తాన్‌లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం చుట్టూ తాలిబన్లు నియంత్రణను పటిష్ఠం చేసిన నేపథ్యంలో అమెరికా తమ దేశ పౌరులకు తాజాగా భద్రతా హెచ్చరిక జారీ చేసింది....

Kabul airport: అమెరికన్ పౌరులకు ఎంబసీ హెచ్చరిక

కాబూల్ : అఫ్ఘానిస్తాన్‌లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం చుట్టూ తాలిబన్లు నియంత్రణను పటిష్ఠం చేసిన నేపథ్యంలో అమెరికా తమ దేశ పౌరులకు తాజాగా భద్రతా హెచ్చరిక జారీ చేసింది.కాబూల్ విమానాశ్రయం నుంచి అమెరికన్లతోపాటు అప్ఘాన్లను యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ విమానాల్లో తరలింపు కార్యకలాపాలను నిర్వహిస్తోంది.కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ తాలిబన్లు నియంత్రణను ఏకీకృతం చేశారు. కాబూల్‌లోని యూఎస్ రాయబార కార్యాలయం, విమానాశ్రయం గేట్ల వెలుపల ఉన్న అమెరికన్ పౌరులకు ఆ దేశ రాయబార కార్యాలయం హెచ్చరిక జారీ చేసింది, బయట ఉన్న అమెరికన్ పౌరులు వెంటనే వెళ్లిపోవాలని కోరింది.


‘‘అబ్బే గేట్, ఈస్ట్ గేట్ లేదా నార్త్ గేట్ వద్ద ఉన్న యూఎస్ పౌరులు వెంటనే బయలుదేరాలి’’ అని కాబూల్‌లోని యూఎస్ ఎంబసీ నుంచి భద్రతా హెచ్చరిక వచ్చింది.మరో 1,500 మంది అమెరికన్లు అఫ్ఘానిస్తాన్ నుంచి తరలింపు కోసం ఎదురుచూస్తున్నట్లు యూఎస్ తెలిపింది. తాలిబన్లు తమ చెక్‌పోస్టుల వద్ద సొంత భద్రతను పెంచుకున్నారని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ జాన్ కిర్బీ వెల్లడించారు.అఫ్ఘానిస్తాన్ నుంచి తరలింపు కార్యకలాపాలను పూర్తి చేయడానికి అధ్యక్షుడు జో బిడెన్ నిర్దేశించిన గడువు ఆగస్టు 31 వరకు కాబూల్ విమానాశ్రయాన్ని నిర్వహించడం మాత్రమే అమెరికా బాధ్యత అని కిర్బీ వివరించారు.

Updated Date - 2021-08-26T13:14:47+05:30 IST