మా విషయాల్లో తలదూర్చొద్దు.. టర్కీకి తాలిబన్ల హెచ్చరిక

ABN , First Publish Date - 2021-07-14T02:22:22+05:30 IST

అమెరికా సేనలు వెనుదిరిగాక కూడా కాబూల్ ప్రధాన ఎయిర్‌పోర్టులో తన సేనలను కొనసాగించేందుకు ప్రయత్నించొద్దని టర్కీకి తాలిబన్లు మంగళవారం నాడు గట్టి హెచ్చరిక పంపారు.

మా విషయాల్లో తలదూర్చొద్దు.. టర్కీకి తాలిబన్ల హెచ్చరిక

కాబూల్: అమెరికా సేనలు అఫ్గానిస్థాన్‌ నుంచి వెళ్లిపోయిన తరువాత కూడా కాబూల్ ప్రధాన ఎయిర్‌పోర్టులో తన సేనలను కొనసాగించేందుకు టర్కీ ప్రయత్నించరాదని తాలిబన్లు మంగళవారం నాడు గట్టి హెచ్చరిక పంపారు. ‘‘వారు తమ నిర్ణయాన్ని పున:సమీక్షించుకోకుండా ఇక్కడే తిష్ఠ వేద్దామనుకుంటే మేం తగు నిర్ణయం తీసుకోక తప్పదు. ఆ తరువాత వచ్చే పర్యవసానాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది.’’ అంటూ తాలిబన్లు హెచ్చరించారు. ఉత్తర అఫ్గానిస్థాన్‌లోని పలు ప్రాంతాలు ఇప్పటికే తాలిబన్ల వశమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారు భీకర దాడులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. నిరాయుధులైన కొందరు అఫ్గాన్ సైనికులను వారు పొట్టన పెట్టుకున్నట్టు ఇటీవల అంతర్జాతీయ మీడియాలో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. 

Updated Date - 2021-07-14T02:22:22+05:30 IST