తాలిబన్లపై ప్రపంచవ్యాప్త నిరసనలు

ABN , First Publish Date - 2021-08-22T19:52:02+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకుని, అరాచకం సృష్టిస్తున్న

తాలిబన్లపై ప్రపంచవ్యాప్త నిరసనలు

న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకుని, అరాచకం సృష్టిస్తున్న తాలిబన్లపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. తాలిబన్లతోపాటు పాకిస్థాన్‌ను కూడా నిరసనకారులు తీవ్రంగా ఎండగడుతున్నారు. ఆఫ్ఘన్లు, బలూచ్‌లు, కుర్దులు వందలు, వేల మంది రోడ్లపైకి వచ్చి, నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 


గ్రీస్‌లోని తెస్సలోనికి నగరంలో వందలాది మంది ఆఫ్ఘన్లు, బలూచ్‌లు, కుర్దులు వీథుల్లోకి వచ్చి తాలిబన్లకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ జాతీయ జెండాలతో వచ్చిన వీరంతా పాకిస్థాన్, తాలిబన్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తాలిబన్లకు పాకిస్థాన్ ప్రత్యక్ష, పరోక్ష మద్దతు ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


లండన్‌లో శనివారం తాలిబన్లకు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమాల్లో వేలాది మంది పాల్గొన్నారు. సెంట్రల్ లండన్‌లోని హైదర్ పార్క్‌ వద్ద ఈ కార్యక్రమాలు జరిగాయి. ఆఫ్ఘనిస్థాన్ ప్రజలకు మద్దతుగా, తాలిబన్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 


రోమ్‌ నగరంలోని రిపబ్లికా స్క్వేర్ వద్ద తాలిబన్లకు వ్యతిరేకంగా ఆదివారం భారీ నిరసన కార్యక్రమం జరిగింది. పష్తూన్, ఉజ్బెక్, తజిక్ కమ్యూనిటీలకు చెందిన ఆఫ్ఘన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాలిబన్లకు, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా బ్యానర్లను ప్రదర్శించారు. ఆఫ్ఘన్ పౌరులకు సంఘీభావం తెలుపుతూ అనేక మంది ఇటాలియన్లు, మీడియా సిబ్బంది కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆఫ్ఘన్లను వదిలిపెట్టవద్దని, వారి ప్రాణాలు కూడా విలువైనవేనని నినాదాలు చేశారు. 




Updated Date - 2021-08-22T19:52:02+05:30 IST