Abn logo
Jul 5 2020 @ 00:00AM

భగవద్గీత చదివిన తర్వాత..

Kaakateeya

భగవద్గీత, వేద పఠనంలో తనకు స్వాంతన లభించిందని తమన్నా చెబుతున్నారు. లాక్‌డౌన్‌లో తన తల్లి సహకారంతో పురాణ, ఇతిహాసాల పఠనంతో పాటు మన మూలాలు తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నానని ఆమె చెప్పిన సంగతి తెలిసిందే. సుమారు మూడు నెలలుగా ఇంటి పట్టున ఉండటంతో భగవద్గీత చదవడం, అర్థం చేసుకోవడంతో పాటు మాతృభాష సింధీ నేర్చుకుంటున్నారామె. ‘‘ఇప్పుడు నా జీవితం మారింది. సాధారణ జీవన విధానాన్ని అలవరుచుకున్నాను. నేను భోజనం చేసే విధానమూ మారింది. ఇంతకు ముందు వేగంగా తినేదాన్ని. ఇప్పుడు నెమ్మదిగా నములుతూ తింటున్నా. నేనూ ప్రశాంతమైన వ్యక్తిగా మారాను. వేళకు నిద్రపోకుండా... రాత్రుళ్లు నిద్రమాని డిజిటల్‌ కంటెంట్‌ చూడాల్సిన అవసరం లేదని అర్థమైంది’’ అని చెప్పారామె. ప్రస్తుతం ఆమె ఓ తెలుగు సినిమా చేస్తున్నారు. గోపీచంద్‌ సరసన ‘సీటీమార్‌’లో ఆమే కథానాయిక. లాక్‌డౌన్‌ ఎత్తేసినా, కరోనా వైరస్‌ మాయం కాలేదు కనుక... ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలంటున్నారు తమన్నా.

Advertisement
Advertisement