Jun 15 2021 @ 10:55AM

బుల్లితెరపై త‌మ‌న్నా.. ఎలా క‌నిపించ‌నుందో తెలుసా?

హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసి ద‌క్షిణాది, ఉత్త‌రాదిన త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మిల్కీబ్యూటీ త‌మ‌న్నా రీసెంట్‌గా డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చింది. ఆహాలో లెవ‌న్త్ అవ‌ర్‌, డిస్నీ హాట్‌స్టార్‌లో న‌వంబ‌ర్ స్టోరి అనే వెబ్ సిరీస్‌ల్లో న‌టించింది. ఇవి కాకుండా ఇప్పుడు త‌మ‌న్నా మ‌రో రంగంలోకి అడుగు పెట్ట‌నుంది. అదే బుల్లితెర‌. సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు.. త‌మ‌న్నా భాటియా ప్ర‌ముఖ టీవీ ఛానెల్ జెమినీ మాస్ట‌ర్ చెఫ్ త‌ర‌హా వంట కార్య‌క్ర‌మాన్ని ప్ర‌సారం చేయాల‌నుకుంటుంది. అందులో జ‌డ్జ్‌గా త‌మ‌న్నా క‌నిపించ‌నుంది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి మ‌రిన్ని వార్త‌లు వెలువ‌డ‌నున్నాయి.