May 3 2021 @ 17:58PM

డిజిట‌ల్‌లో త‌మ‌న్నా మ‌రో ప్ర‌య‌త్నం

మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ట్రెండ్‌ను ప‌క్కాగా ఫాలో అవుతూ వ‌స్తోంది. సినిమాలో త‌మ‌న్నా ఎంచుకునే పాత్ర‌లే కాదు రీసెంట్‌గా ఆమె డిజిట‌ల్ రంగంలో ఇచ్చిన ఎంట్రీనే త‌మ‌న్నా ట్రెండ్‌లో ఉంద‌ని చెప్ప‌డానికి ప‌క్కా ఉదాహ‌ర‌ణ‌. ఈ ఏడాది తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’లోప్ర‌సార‌మైన ‘లెవ‌న్త్ అవ‌ర్’ అనే వెబ్ సిరీస్‌లో త‌మ‌న్నా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సిరీస్ ప్రేక్ష‌కుల‌ను పెద్ద‌గా ఆక‌ట్టుకోక‌పోయినా డిజిటల్‌లో త‌మ‌న్నా స్పీడు మాత్రం త‌గ్గించ‌లేదు. మ‌రో వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కులను మెప్పించ‌డానికి సిద్ధ‌మైంది. ప్ర‌ముఖ డిజిట‌ల్ మాధ్య‌మం హాట్‌స్టార్‌లో ‘న‌వంబ‌ర్ స్టోరీ’ అనే పేరుతో తెర‌కెక్కిన వెబ్ సిరీస్ మే 14న ప్ర‌సారం కానుంది.  తెలుగు, హిందీ, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ వెబ్ సిరీస్ ప్ర‌సారం అవుతుంది. మ‌రి ‘న‌వంబ‌ర్ స్టోరీ’తో డిజిట‌ల్‌లో త‌మ‌న్నా స‌క్సెస్ అవుతుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...