చింతపండు రసంతో బరువు తగ్గొచ్చు!

ABN , First Publish Date - 2020-09-28T05:30:00+05:30 IST

బరువు తగ్గాలనే ఆలోచనతో ఉన్న వారు చింతపండు రసం ప్రయత్నించవచ్చు. దీనిలోని డైయురెటిక్‌ గుణాలు ఒంట్లోని విషపదార్థాలను బయటకు పంపిస్తాయి. చింతపండులో పీచుపదార్థం ఉండడం వల్ల తొందరగా ఆకలి వేయదు...

చింతపండు రసంతో బరువు తగ్గొచ్చు!

బరువు తగ్గాలనే ఆలోచనతో ఉన్న వారు చింతపండు రసం ప్రయత్నించవచ్చు. దీనిలోని డైయురెటిక్‌ గుణాలు ఒంట్లోని విషపదార్థాలను బయటకు పంపిస్తాయి. చింతపండులో పీచుపదార్థం ఉండడం వల్ల తొందరగా ఆకలి వేయదు. దాంతో ఎక్కువ తినడం తగ్గిస్తారు. ఫలితంగా బరువు కూడా తగ్గుతారు. 


  1. చింతపండు రసం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అందుచేత జీర్ణసంబంధమైన సమస్యలున్న వారు చింతపండు రసంతో తింటే ఫలితం ఉంటుంది. అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు చింతపండు రసం చక్కని పరిష్కారం. 
  2. దీనిలోని విటమిన్‌ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చింతపండు రసం కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. గుండె ఆరోగ్యానికి దోహదపడుతుంది. 


తయారీ...

కొద్దిగా చింతపండు, తే నె, నీళ్లు, కొన్ని ఐస్‌క్యూబ్స్‌ తీసుకోవాలి. చింతపండును శుభ్రం చేసి, గింజలు తీసేయాలి. రెండు గ్లాసుల నీళ్లను వేడిచేయాలి. ఇప్పుడు అందులో చింతపండు వేసి కొంత సమయం అలానే ఉండనివ్వాలి. తరువాత మంట ఆర్పేసి, చింతపండు రసాన్ని గ్లాసులోకి వడబోయాలి. చల్లారనివ్వాలి. రుచికోసం కొద్దిగా తేనె కలపాలి. ఐస్‌క్యూబ్స్‌ వేసి సర్వ్‌ చేయాలి.

Updated Date - 2020-09-28T05:30:00+05:30 IST