May 7 2021 @ 00:04AM

తమిళ హాస్యనటుడు పాండు మృతి

ప్రముఖ తమిళ హాస్యనటుడుపాండు కొవిడ్‌తో మరణించారు. కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందారు. సుమారు 40 సంవత్సరాల సుదీర్ఘ నటజీవితంలో పాండు 500లకు పైగా చిత్రాలలో నటించారు. పాండు నటించిన తొలి చిత్రం ‘కరై ఎల్లమ్‌ స్నేనబగవూ’. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు, హీరో ఎంజీఆర్‌కు పాండు సన్నిహితుడు. అన్నాడీఎంకే పార్టీని స్థాపించినప్పుడు- దానికి రెండు ఆకుల గుర్తును పాండూనే రూపొందించారు. ఆ తర్వాత ‘క్యాపిటల్‌ లెటర్స్‌’ పేరిట ఒక డిజైన్‌ కంపెనీని కూడా పాండూ స్థాపించారు. ఆయన మృతి పట్ల తమిళ సినీ పరిశ్రమ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.