తమిళ జాలర్లపై శ్రీలంక నావికాదళం దాడి

ABN , First Publish Date - 2021-10-20T12:47:09+05:30 IST

తమిళ జాలర్లపై శ్రీలంక నావికాదళం మరోమారు విరుచుకుపడింది. గస్తీ నౌకతో జాలర్ల పడవను బోల్తాకొట్టించింది. ఆ పడవలోని ముగ్గురు జాలర్లలో ఇద్దరిని నిర్బంధించింది. మరో జాలరి గల్లంతయ్యాడు. పుదుకోట జిల్లా

తమిళ జాలర్లపై శ్రీలంక నావికాదళం దాడి

చెన్నై(tamilnadu): తమిళ జాలర్లపై శ్రీలంక నావికాదళం మరోమారు విరుచుకుపడింది. గస్తీ నౌకతో జాలర్ల పడవను బోల్తాకొట్టించింది. ఆ పడవలోని ముగ్గురు జాలర్లలో ఇద్దరిని నిర్బంధించింది. మరో జాలరి గల్లంతయ్యాడు. పుదుకోట జిల్లా కోట్టైపట్టినం నుంచి కొంతమంది జాలర్లు సోమవారం వేకువజాము సముద్రంలో చేపలవేటకు బయలుదేరారు. మంగళవారం వేకువజాము రాజ్‌కిరణ్‌, కందన్‌, జేవియర్‌ అనే ముగ్గురు జాలర్లు ఓ మరపడవలో చేపలవేట సాగిస్తుండగా శ్రీలంక నావికాదళం సభ్యులు గస్తీ నౌకలో అక్కడకు వచ్చి తమ దేశపు సముద్ర సరిహద్దుల్లోకి చొరబడ్డారంటూ ఆరోపిస్తూ ఆ పడవను ఢీకొట్టారు. ఊహించని ఆ సంఘటనతో జాలర్లు ముగ్గురూ భీతిల్లారు. శ్రీలంక నావికాదళం సభ్యులు మళ్ళీ తమ గస్తీనౌక వేగం పెంచి జాలర్లపడవను ఢీకొట్టడంతో అది బోల్తాపడింది. దీనితో పడవలోని ముగ్గురు జాలర్లు నీట మునిగారు. వీరిలో కందన్‌, జేవియర్‌ను శ్రీలంక నావికాదళం సభ్యులు కాపాడి నిర్బంధించారు. తమ గస్తీ నౌకలో శ్రీలంకకు తీసుకెళ్ళారు. మరో జాలరి రాజ్‌కిరణ్‌ గల్లంతయ్యారు. 

Updated Date - 2021-10-20T12:47:09+05:30 IST