May 17 2021 @ 23:46PM

తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోకి ఓటీటీ సేవలు

దర్శకుడు వి.వి.వినాయక్‌, రచయిత విజయేంద్రప్రసాద్‌ ప్రారంభించిన ఊర్వశీ ఓటీటీ వంద రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు చేరువైందని ఆ సంస్థ సీఈవో రామసత్యనారాయణ చెప్పారు. చిన్న నిర్మాతలకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతోనే ప్రారంభమైన మా సంస్థ 40 లక్షల మంది మనసులు చూరగొంది.


చిన్న బడ్జెట్‌ సినిమాలకు ఓటీటీ నిజంగా ఓ వరమే’ అన్నారు. ఊర్వశీ ఓటీటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవి కనగాల మాట్లాడుతూ ‘ ప్రతి వారం ఒక కొత్త సినిమా అనే నినాదంతో సంస్థను ప్రారంభించాం. కానీ వంద రోజుల్లోనే 25 కొత్త సినిమాలు విడుదల చేశాం. ఇప్పుడు తమిళ, కన్నడ భాషల్లోకి ఊర్వశీ సేవలు విస్తరించాం. త్వరలో మలయాళ, హిందీ భాషల్లోకి కూడా ఓటీటీ సేవలు ప్రారంభించనున్నాం’ అని తెలిపారు.