Abn logo
Jul 26 2021 @ 13:22PM

first warning : ముల్ల పెరియార్ డ్యాంకు వరదపోటు

ఇడుక్కి(కేరళ): వివాదాస్పదమైన ముల్లా పెరియార్ డ్యాం వరదనీటితో నిండింది. ముల్లాపెరియార్ డ్యాం నీటిమట్టం సోమవారం నాటికి 136 అడుగులకు చేరుకోవడంతో తమిళనాడు ప్రజాపనుల విభాగం అధికారులు ఇడుక్కి జిల్లా అధికార యంత్రాంగానికి మొదటి ప్రమాద హెచ్చరిక సందేశాన్ని పంపించారు. డ్యాం ముల్లయార్, పెరియార్ నదుల సంగమం వద్ద కేరళలో ఉన్నప్పటికీ దీని నుంచి మధురై, తేని, దిండిగల్, శివగంగ, రామనాథపురం ప్రాంతాలకు సాగునీరు, తమిళనాడుకు తాగునీటి అవసరాలు తీరుస్తోంది. భారీవర్షాల వల్ల వరదనీరు చేరడంతో 5,929 అడుగుల నీరు జలాశయంలోకి చేరింది. వరదనీటి ప్రవాహంతో డ్యాం నుంచి 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారు. ఆనకట్ట 138 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. నదీతీరంలోని గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.