కొత్త జాతీయ రహదారులుగా నోటిఫై చేయండి; మోదీని కోరిన స్టాలిన్

ABN , First Publish Date - 2021-11-19T00:09:27+05:30 IST

కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరో విజ్ఞప్తి చేశారు. ఎనిమిది రాష్ట్ర రోడ్లను జాతీయ రహదారులుగా

కొత్త జాతీయ రహదారులుగా నోటిఫై చేయండి; మోదీని కోరిన స్టాలిన్

చెన్నై: కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరో విజ్ఞప్తి చేశారు. ఎనిమిది రాష్ట్ర రోడ్లను జాతీయ రహదారులుగా నోటిఫై చేయాలని సీఎం ఎంకే స్టాలిన్ కేంద్రాన్ని కోరారు. ఎంఆర్టీహెచ్ ఇప్పటికే దీనికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినందున ఎనిమిది రాష్ట్ర రహదారులను కొత్త జాతీయ రహదారులుగా నోటిఫై చేసేలా కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖను ఆదేశించాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. అవసరమైన నిధులతో ఈ రోడ్ల అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కోరారు. తిరువణ్ణామలై - కళ్లకురిచ్చి, వల్లీయూర్ - తిరుచెందూర్, కొల్లేగల్ - హనూర్ - ఎంఎం హిల్స్ - పాలార్ రోడ్ - తమిళనాడు సరిహద్దు, తమిళనాడులోని మెట్టూరు, పళని - ధరాపురం, ఆర్కాట్ - దిండివనం, మెట్టుపాళ్యం - భవానీ, అవినాశి వరకు విస్తరించాల్సిన ఎనిమిది రహదారులు అప్‌గ్రేడ్ చేయాలన్నారు.

Updated Date - 2021-11-19T00:09:27+05:30 IST