కోస్తా ఆంధ్రా,తమిళనాడులలో మూడు రోజుల పాటు heavy rainfall

ABN , First Publish Date - 2021-11-09T15:36:07+05:30 IST

వచ్చే 12 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా ఏర్పడే అల్పపీడనం ప్రభావం వల్ల తమిళనాడు, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో నవంబరు 9 నుంచి 11వతేదీల మధ్య భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే...

కోస్తా ఆంధ్రా,తమిళనాడులలో మూడు రోజుల పాటు heavy rainfall

వాతావరణశాఖ తాజాగా వెదర్ బులెటిన్ జారీ

చెన్నై: వచ్చే 12 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా ఏర్పడే అల్పపీడనం ప్రభావం వల్ల తమిళనాడు, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో నవంబరు 9 నుంచి 11వతేదీల మధ్య భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఈ  మేర భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం విడుదల చేసిన వెదర్ బులెటిన్‌లో సూచించింది. భారీవర్షాల తర్వాత మరో రోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవవచ్చని  ఐఎండీ పేర్కొంది. అదే సమయంలో కేరళలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.


ఈ అల్పపీడనం వాయువ్య దిశగా పయనించి ఈ నెల 11వతేదీ నాటికి తమిళనాడు తీరానికి చేరవచ్చని వాతావరణశాఖ తన బులెటిన్‌లో పేర్కొంది.అల్పపీడనం కారణంగా బంగాళాఖాతంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొంటాయని నవంబర్ 11వ తేదీ వరకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరంలోని సముద్రంలో చేపలవేటకు మత్స్యకారులు వెళ్లవద్దని వాతావరణశాఖ అధికారులు సూచించారు.భారత భూభాగానికి దూరంగా అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి అల్పపీడనంగా మారింది. 


మంగళవారం సాయంత్రం వరకు మత్స్యకారులు అరేబియా సముద్రంలోకి వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.రానున్న మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం లేదని ఐఎండీ అంచనా వేసింది. వాయువ్య భారతదేశం,  మధ్యప్రదేశ్‌లో రాబోయే రెండు రోజుల్లో క్రమంగా 2-3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గుతుందని వాతావరణశాఖ అధికారులు వివరించారు.


Updated Date - 2021-11-09T15:36:07+05:30 IST