మ్యాట్రిమోనీ సైట్ ద్వారా పరిచయం.. పెళ్లి చేసుకున్న మర్నాడే అతడి నుంచి ఊహించని ప్రపోజల్.. ఆమె నో చెప్పిందని..

ABN , First Publish Date - 2021-09-14T18:06:21+05:30 IST

ఆమెకు అతడు మ్యాట్రిమోనీ సైట్ ద్వారా పరిచయమయ్యాడు.. ఆమెను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు..

మ్యాట్రిమోనీ సైట్ ద్వారా పరిచయం.. పెళ్లి చేసుకున్న మర్నాడే అతడి నుంచి ఊహించని ప్రపోజల్.. ఆమె నో చెప్పిందని..

ఆమెకు అతడు మ్యాట్రిమోనీ సైట్ ద్వారా పరిచయమయ్యాడు.. ఆమెను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు.. ఆమెతో మూడు నెలలు ఫోన్ ద్వారా మాట్లాడాడు.. అనంతరం తను ఆర్థిక కష్టాల్లో ఉన్నానని, డబ్బులు కావాలని అడిగాడు.. దాంతో ఆమె అతడికి రూ.11 లక్షలు ఇచ్చింది.. అనంతరం ఆమెను వివాహం చేసుకున్నాడు.. పెళ్లి చేసుకున్న తర్వాతి రోజు ఆమెకు మరో షాకిచ్చాడు.. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.. చెన్నైలో ఈ ఘటన జరిగింది. 


చెన్నైకు చెందిన దేవరాజ్ అనే వ్యక్తి ఓ మ్యాట్రిమోనీ సైట్ ద్వారా చించ్‌వాడ్‌కు చెందిన మహిళతో పరిచయం పెంచుకున్నాడు. ఫోన్ ద్వారా ఆమెతో మాటలు కలిపాడు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. తన ఆర్థిక కష్టాల గురించి చెప్పి ఆమె దగ్గర్నుంచి రూ.11,04,500 తీసుకున్నాడు. ఇటీవల ఆమెను చెన్నైకి పిలిపించి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. పెళ్లి తర్వాతి రోజు ఆమెకు మరో షాకిచ్చాడు. నీ పేరు మీద రూ.80 లక్షలు బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలని అడిగాడు. అందుకు ఆమె తిరస్కరించింది. 


ఇవి కూడా చదవండి

ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో హృదయ విదారకర ఘటన.. మంచంపై ఓ మహిళను 12 కిలోమీటర్ల దూరం పాటు మోసుకెళ్లి..





అటు వైపే వెళ్తున్నానంటూ లిఫ్ట్ ఇస్తానందో మహిళ.. సరేనని కారు ఎక్కిన భార్యాభర్తలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..


అప్పుడు దేవరాజ్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. రూ.80 లక్షల బ్యాంక్ లోన్ తీసుకోకపోతే మీ తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించాడు. దీంతో సదరు యువతి పోలీసులను ఆశ్రయించి మొత్తం విషయం చెప్పింది. పోలీసుల విచారణలో మరో షాకింగ్ విషయం బయటపడింది. రిజిస్టర్ మ్యారేజ్ జరిగినట్టు ఇచ్చిన సర్టిఫికెట్ ఫేక్ అని పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2021-09-14T18:06:21+05:30 IST