Tamil Nadu: రూ.2.5 కోట్ల విలువైన అంబర్‌గ్రీస్‌ స్వాధీనం

ABN , First Publish Date - 2021-11-15T16:57:20+05:30 IST

తమిళనాడులోని నాగపట్టినం జిల్లా వేదారణ్యం వద్ద రూ.2.50 కోట్ల విలువ చేసే అంబర్‌ గ్రీస్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వేదారణ్యం తాలూకాలోని

Tamil Nadu: రూ.2.5 కోట్ల విలువైన అంబర్‌గ్రీస్‌ స్వాధీనం

చెన్నై: తమిళనాడులోని నాగపట్టినం జిల్లా వేదారణ్యం వద్ద రూ.2.50 కోట్ల విలువ చేసే అంబర్‌ గ్రీస్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వేదారణ్యం తాలూకాలోని వెల్లపల్లం అనే కోస్తాతీర గ్రామంలో నాగపట్టినం జిల్లా క్యూ బ్రాంచ్‌ పోలీసులు తనిఖీలు చేశారు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు చేతిలో సంచులతో అనుమానాస్పదంగా నిలబడివున్నారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా, వెల్లప్పల్లం గ్రామంలోని జాలర్ల కాలనీకి చెందిన బాలగురు (37), సత్యానందం (42)గా గుర్తించారు. కారైక్కాల్‌ నుంచి ఒక వ్యక్తి వస్తున్నారని, ఆయనకు అంబర్‌ గ్రీస్‌ అందించేందుకు వేచిచూస్తున్నట్టు తెలిపారు. దీంతో వారివద్ద అంబర్‌ గ్రీస్‌ను క్యూబ్రాంచ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

Updated Date - 2021-11-15T16:57:20+05:30 IST