Abn logo
Sep 22 2021 @ 01:12AM

తమిళనాడు వాసి మృతి

తాడిమర్రి, సెప్టెంబరు 21: మండలంలోని పెద్దకోట్ల గ్రామ సమీపంలో ప్రమాదవశాత్తు చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వా యర్‌లో పడి తమిళనాడు రాష్ట్రానికి చెందిన సెల్వం (45) మృతిచెందాడు. డ్రైవర్‌ పనిచేస్తున్న సెల్వం మంగళవా రం రోజున వేరుశనగ కాయలు తరలించేందుకు ఐచర్‌ వాహ నానికి డ్రైవర్‌గా వచ్చాడు. పెద్దకోట్ల గ్రామ చిత్రావతి నీటిలో ముఖం కడుక్కునేందుకు వెళ్లి కాలు జారి నీటిలో పడ్డాడు. ఈత రాకపోవడంతో మునిగిపోయాడు. గమనించి న సమీపంలోని వాసులు బయటకు తీసే సమయానికి అప్ప టికే మృతిచెందినట్టు గుర్తించారు. తాడిమర్రి పోలీసు లు వివరాలు సేకరిస్తున్నారు.