Abn logo
Oct 15 2021 @ 02:13AM

తమిళనాట ‘విజయ్‌ మక్కళ్‌ ఇయక్కం’ సత్తా

చెన్నై, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): తమిళనాట ఈ నెల 6, 9 తేదీల్లో రెండు విడతలుగా 9 జిల్లాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రముఖ తమిళ సినీనటుడు విజయ్‌ అభిమానుల సంఘం ‘దళపతి విజయ్‌ మక్కళ్‌ ఇయక్కం’ సత్తా చాటింది. విజయ్‌ మక్కళ్‌ ఇయక్కం నుంచి స్వతంత్ర అభ్యర్థులు 169 స్థానాల్లో పోటీచేసి.. 115 స్థానాల్లో గెలుపొందారు. తమిళనాడులో హీరో విజయ్‌ ఫ్యాన్స్‌ ఆయన పేరిట అభిమాన సంఘాలు స్థాపించి సమాజసేవ చేస్తుంటారు. ఈ క్రమంలోనే విజయ్‌ రాజకీయాల్లోకి వస్తాడని ఆయన అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. తన అనుమతి లేకుండా తనపేరిట రాజకీయ పార్టీ స్థాపించారని తన తండ్రి చంద్రశేఖర్‌రావుపైనే విజయ్‌ న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు. ఈ క్రమంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన అభిమానుల సంఘం విజయం సాధించడం విశేషం.