Tamil శకటానికి అనుమతి నిరాకరణ

ABN , First Publish Date - 2022-01-25T17:45:44+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్‌ డే వేడుకల్లో రాష్ట్రానికి చెందిన శకటానికి అనుమతి నిరాకరించినందుకు నిరసనగా సోమవారం తిరునల్వేలిలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తిరునల్వేలి కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ విభాగం

Tamil శకటానికి అనుమతి నిరాకరణ

                                 - తిరునల్వేలిలో కాంగ్రెస్‌ ధర్నా


చెన్నై: దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్‌ డే వేడుకల్లో రాష్ట్రానికి చెందిన శకటానికి అనుమతి నిరాకరించినందుకు నిరసనగా సోమవారం తిరునల్వేలిలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తిరునల్వేలి కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ విభాగం ఆధ్వర్యంలో అక్కడి కొక్కిరకుళం ప్రాంతం వద్ద ఈ ఆందోళన నిర్వహించారు. ధర్నాకు కాంగ్రెస్‌ స్థానిక నాయకుడు శంకరపాండ్యన్‌ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ధర్నా వేదికపై పార్టీకి చెందిన యువకులు స్వాతంత్య్ర సమరయోధులు భారతియార్‌, వావు చిదంబరనార్‌ వేలునాచ్చియార్‌ వేషధారణతో ఆశీనుల య్యారు. ధర్నాలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి నిరసనగా నినాదాలు చేశారు.

Updated Date - 2022-01-25T17:45:44+05:30 IST